Kitchen Hacks: ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించి తక్కువ నూనెతో ఆహరాన్ని తయరు చేసుకోండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..

మారిన జీవన శైలి.. మారిన ఆహారపు అలవాట్లు .. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అందుకని వీలైనంత వరకూ వేయించిన ఆహారానికి దూరంగా ఉండడం ఉత్తమం. ఇది నేటి యువతకు కొంచెం కష్టమైన పనే.. అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం కనుక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, స్థూలకాయం ఎక్కువ నూనే ఉన్న ఆహరాన్ని తినొద్దు. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తక్కువ నూనేతో తయారు చేయలేం.. అయితే కొన్ని చిట్కాలను పాటించని తక్కువ నూనెతో రుచికరమైన ఆహారాన్ని వండుకోవచ్చు.

Kitchen Hacks: ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించి తక్కువ నూనెతో ఆహరాన్ని తయరు చేసుకోండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
Kitchen Hacks
Follow us
Surya Kala

|

Updated on: Nov 15, 2024 | 3:24 PM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే నేటి యువతకు ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండడం కష్టం అని చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు ఎక్కువ నూనె ఉన్న ఆహార పదార్ధాలను తినొద్దు. అయితే తక్కువ నూనేతో రుచికరంగా ఆహర పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు తక్కువ నూనెతో రుచికమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ చిట్కాలు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ స్టిక్ వస్తువులున్నాయి. ఈ నాన్ స్టిక్ పాన్ లో తక్కువ నూనెని ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని వండుకోవచ్చు. దీనికి కొద్దిగా నూనె చాలు. ఆహారం బాగా ఉడుకుతుంది. అందువల్ల నూనె ఎక్కువగా ఉపయోగించి తయారు చేసుకునే ఆహారపదార్థాల తయారీకి నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించవచ్చు.

కూరలు తయారు చేసుకునే పాత్రలో నేరుగా పాన్ లోకి నూనె పోయవద్దు. ఒక చెంచా లేదా కొలిచే కప్పును ఉపయోగించి పాన్ లోకి నూనె పోయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన తక్కువ నూనేతోనే వంట చేసుకోవచ్చు. రుచికరమైన వంటలు రెడీ.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కనుక పాత్రలో నేరుగా నూనె పోయవద్దు. ఇలా చేయడం వలన తెలియకుండానే ఎక్కువ నూనె పడిపోవచ్చు.

ఇవి కూడా చదవండి

వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే శరీరంలోకి తక్కువ నూనె వెళ్తుంది. కనుక వేయించిన ఆహారం బదులుగా ఉడక బెట్టిన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి.

ఆవిరిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకోవడం వలన అదనపు నూనె అవసరం లేకుండా పోషకాలతో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఆవిరితో కూరగాయలు, చేపలు, కుడుములు వంటి అనేక రకాల ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. చేపలు, మాంసం, గుడ్లు తక్కువ నూనె.. మసాలాలను వేసి ఆవిరితో ఉడికించి తినవచ్చు.

గ్రిల్లింగ్ చేసి ఆహారం తయారు చేసుకోవచ్చు. అధిక నూనె అవసరం లేకుండా గ్రిల్లింగ్ చేసి ఆహారం తయారు చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్‌ అందిస్తుంది. లీన్ మాంసాలు, కూరగాయలు, పండ్లను కూడా వండడానికి ఇది ఒక గొప్ప పద్ధతి.

బేకింగ్ అనేది కేక్‌ల తయారీకి మాత్రమే కాదు. ఇది తక్కువ నూనెతో వివిధ రకాల వంటకాలను చేయడానికి కూడా అనుసరించే ఒక వంట శైలి. ఈ పద్ధతిలో మాంసాహారం, కూరగాయలతో కూడా వంటలు చేసుకోవచ్చు.

ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఆహారంలో వంటనూనె వాడకం తగ్గించుకుని టేస్టీ టేస్టీగా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

తక్కువ నూనెతో రుచికరమైన ఆహారాన్ని ఈ టిప్స్ తో తయారు చేసుకోండి
తక్కువ నూనెతో రుచికరమైన ఆహారాన్ని ఈ టిప్స్ తో తయారు చేసుకోండి
హైడ్రోజన్ రైల్ వచ్చేస్తుందోచ్..! ఆ రూట్‌లోనే ట్రయల్ రన్
హైడ్రోజన్ రైల్ వచ్చేస్తుందోచ్..! ఆ రూట్‌లోనే ట్రయల్ రన్
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బిహార్‌లోనే ఎందుకు?
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బిహార్‌లోనే ఎందుకు?
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరగనుందా? షాకింగ్‌ నివేదిక!
రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరగనుందా? షాకింగ్‌ నివేదిక!
డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌
డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం
నంగనాచిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..
నంగనాచిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..
ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్
ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్