AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: మనిషిలో మాయమవుతున్న మానవత్వం.. రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి

రోజు రోజుకీ మనిషిలోని మానవత్వం దిగజారిపోతోంది. చిన్న చిన్న కారణాలతో మానవ మృగంగా మారిపోతున్నాడు. రోగి ప్రాణాలను కాపాడేందుకు సకలంలో ఆస్పత్రికి చేర్చే అంబులెన్స్ సిబ్బంది తమ డ్యూటీని మరచిపోయి.. రోగిని పొదల్లో పడేసి వెళ్లిపోయింది. ఈ విషయంపై అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ విషయంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. నేరం రుజువైతే నిందితులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Bihar: మనిషిలో మాయమవుతున్న మానవత్వం.. రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి
Bihar News
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 2:19 PM

Share

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళుతున్న అంబులెన్స్ సిబ్బంది సడెన్ గా రోగిని వాహనంలోంచి బయటకు తీసి పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో రోగి మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న బాటసారులు మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడి ఔరంగాబాద్‌లోని సదర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో సదర్ ఆసుపత్రి వైద్యులు క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం ఉన్నత గవర్నమెంట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం రోగిని ఉన్నత కేంద్రానికి తీసుకెళ్లే బాధ్యతను అంబులెన్స్ డ్రైవర్, స్ట్రెచర్‌మెన్, మరొక కార్మికుడికి అప్పగించింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది రోగిని తీసుకుని బయలుదేరారు.. అయితే వారు మార్గమధ్యంలో రోగిని పొదలో పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ఈ కేసులో అంబులెన్స్‌లో ఉన్న కార్మికుడు హరేంద్ర కుమార్, స్ట్రెచర్‌మెన్ సురంజన్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితులు హరేంద్ర కుమార్, స్ట్రెచర్‌మెన్ సురంజన్ కుమార్‌లు ఆసుపత్రి యాజమాన్యంపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆస్పత్రి డీఎస్‌ అశుతోష్‌ కుమార్‌ సర్‌ పేషెంట్‌ని రోడ్డుపక్కన వదిలేయాలని చెప్పారని తాము అదే చేసినట్లు వీరిద్దరూ పోలీసులకు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రి ఏసీఎంఓ ఏం చెప్పారు?

రెండు రోజుల క్రితం పొదల్లో రోగి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తూనే.. మరోవైపు సదరు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో స్ట్రెచర్‌మ్యాన్ .. రోగిని అంబులెన్స్‌లోకి ఎక్కించడం కనిపించింది. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేశారు. కాగా ఈ విషయంలో అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఏసీఎంఓ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అని అన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. నేరం రుజువైతే నిందితులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్