AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Purifying Plants: గాలిని శుభ్రపరిచే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవే.. నాసా పరిశోధనలో వెల్లడి..

దేశ రాజధాని డిల్లీ సహా అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతుంది. మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ కాలుష్యం. అటువంటి పరిస్థితిలో అధికారులు వాయు కాలుష్య నియంత్రకు చర్యలు తీసుకుంటుంది. మరోవైపు మీరు కూడా మీ ఇంట్లో లేదా పరిసరాల్లో గాలిని మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేక రకాల మొక్కలను పెంచుకోవచ్చు. మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.

Air Purifying Plants: గాలిని శుభ్రపరిచే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవే.. నాసా పరిశోధనలో వెల్లడి..
Air Cleaning Plants
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 12:16 PM

Share

దేశంలో చలికాలం ప్రారంభం అయింది. అయితే దీనితో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. విషపూరితమైన గాలి కారణంగా.. అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా పెరిగింది. ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్న దృష్ట్యా.. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తో తీసుకునే చర్యలతో పాటు ఇంట్లో కూడా కొన్ని రకాల చర్యలు తీసుకోవడం వాతావరణానికి, ఆరోగ్యానికి మంచిది. గాలి నాణ్యతను పెంచడానికి.. వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక బెస్ట్ ఎంపిక. ఇంటిలో లేదా చుట్టుపక్కల కొన్ని ప్రత్యేక మొక్కలను నాటవచ్చు. మొక్కలు గాలిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. నాసా పరిశోధనలో కొన్ని ఇంట్లో ఉండే మొక్కలు గాలిలో ఉండే విషపదార్థాలను పీల్చుకోగలవని కనుగొంది.

హెల్త్‌లైన్ ప్రకారం చెట్లను పెంచడం వలన గాలి నాణ్యతను కొద్దిగా మెరుగుపరుస్తుంది. అయితే చెట్లు ఎయిర్ ప్యూరిఫైయర్‌లకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు. ఈ రోజు గాలిని కొంతవరకు శుభ్రపరచగల కొన్ని రకాల మొక్కల గురించి తెలుసుకుందాం..

స్పైడర్ ప్లాంట్: ఇది ఒక ఇండో ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ గాలిలో ఉండే టాక్సిన్స్‌ను గ్రహిస్తుంది. ఇది ఇంట్లో ఆక్సిజన్ కొరతను తొలగించడంలో సహాయపడుతుంది. దీనిని రిబ్బన్ ప్లాంట్ లేదా ఎయిర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. బెడ్ రూమ్ లేదా గదిలో పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

స్నేక్ ప్లాంట్: ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన గాలిలో హానికరమైన కణాలను ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. స్నేక్ ప్లాంట్‌కు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించే శక్తి ఉంది. ఇది ఇంట్లో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

కలబంద మొక్క: అలోవెరా మొక్క చర్మానికి,ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు గాలిని శుద్ధి చేయడానికి కూడా పనిచేస్తుంది. ఇంటి ఆవరణలో నాటడం ద్వారా ఇంటి గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలోవెరా బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన కణాలను ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది.

వెదురు తాటి లేదా బాంబు ప్లాంట్: ఇది కూడా ఇండోర్ ప్లాంట్. ఇంట్లో ఈ వెదురు తాటి మొక్కను పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ గాలిలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోథైలీన్, జిలీన్, టోలున్ వంటి ప్రమాదకరమైన కణాలను ఫిల్టర్ చేయడానికి పని చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)