AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strange disease: ఆ గ్రామంలో 30 ఏళ్లుగా వింత వ్యాధి.. చిన్న వయసులోనే వంగి పోయే శరీరం.. పట్టించుకోని పాలకులు

ఆ గ్రామంలోని ప్రజలు గత 30 30 ఏళ్లుగా వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆ బాధితులకు చాలా మంది వైద్యులు రకరకాల చికిత్సలు అందించారు. అయినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఆ వ్యాధి నయం కాలేదు. చిన్నారులు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ గ్రామస్తుల వ్యాధిని గుర్తించడానికి తగిన చికిత్సను అందించడానికి ఇప్పుడు పాలనా యంత్రం సీతకన్నేసింది. ఆ బాధిత గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

Strange disease: ఆ గ్రామంలో 30 ఏళ్లుగా వింత వ్యాధి.. చిన్న వయసులోనే వంగి పోయే శరీరం.. పట్టించుకోని పాలకులు
Balrampur Strange Disease
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 11:25 AM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రాంపూర్‌లో గత కొన్నేళ్లుగా వింత వ్యాధితో బాధపడుతున్న ఓ గ్రామం ఉంది. దీని వెనుక కారణం ఏమిటో ఇప్పటి వరకు ప్రజలకు అర్థం కాలేదు. 150 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో దాదాపు 100 మందికి పైగా వ్యక్తుల దంతాలకు వ్యాధులు సోకి పసుపు రంగులోకి మారాయి. వీటి దంతాలను ఎవరైనా చూస్తే పాన్ మసాలా లేదా గుట్కా తినే అలవాటు ఉందేమో అనిపిస్తుంది. ఇదొక్కటే కాదు.. చిన్నవయసులోనే నడుము వంగిపోయే వ్యాధికి గురైన వారు కూడా గ్రామంలో 25 మంది వరకూ ఉన్నారు.

ఈ బాధితులు రామచంద్రాపూర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని హధితార్ గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామంలో 150 మందికి పైగా నివసిస్తున్నారు. చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక్కడ నివసిస్తున్న 100 మందికి పైగా యువకులు, చిన్నారులు, వృద్ధుల దంతాలు పాడైపోయాయి. దీంతో ఈ బాధితులు తినడానికి, తాగడానికి ఇబ్బందులు పడుతున్నారు.

అయితే దంతాల అనారోగ్యంతోనే పరిమితం కాలేదు. ఈ గ్రామంలో 25 మందికి పైగా ప్రజలు వయసు తో సంబంధం లేకుండా వెన్ను సమస్యలతో బాధపడుతున్నారు. వీరు వంగి మాత్రమే నడవగలరు. వృద్ధులకు ఈ సమస్య వచ్చిందంటే అర్థం ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు ఈ సమస్య ఆ గ్రామంలో 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి కూడా వస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇవి కూడా చదవండి

గత 30 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని ఇక్కడి ప్రజలు తెలిపారు. ఈ సమస్యతో ప్రజలు ఎంతగానో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పుడు వారు తమ సమస్యలను ఎవరితోనూ పంచుకోవడానికి సిద్ధంగా కూడా లేదు. ఎందుకంటే బాధితులు చికిత్స కోసం వైద్యులను సంప్రదించారు. అయినా ఈ వ్యాధి నయం కాలేదు. అయితే గ్రామం వేలుపుల ఏ పెద్ద డాక్టర్ దగ్గర అయినా వైద్యం చేయించుకోవడానికి గ్రామస్తుల దగ్గర అంత డబ్బు లేదు.

పిల్లలు పుడితే ఐదేళ్ల వరకు దంతాలు బాగానే ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. తరువాత దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. తర్వాత పళ్ళు పుచ్చుపోవడం మొదలవుతాయి. తమ గ్రామంలో నీటి సమస్య ఉందని ప్రజలు చెబుతున్నారు. దీంతో బోర్‌వెల్‌ నీళ్లు తాగాల్సి వస్తోంది. బోలార్‌వెల్‌లోని నీరు మంచి నీరు కాదని.. ఈ నీటిని ఒక పాత్రలో నింపు రాత్రి నిల్వ చేస్తే.. మర్నాటికి ఆ పాత్ర పసుపు రంగులోకి మారుతుంది. బహుశా దీని కారణంగా తమ గ్రామంలోని వారి దంతాలకు ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు అని అంటున్నారు.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

ఈ సమస్య చాలా కాలంగా ఉన్నా.. ఆరోగ్య శాఖ, పీహెచ్‌ఈ శాఖ ఇలా ఎవరూ తమని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన సీఎంహెచ్‌ఓ

అయితే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో జిల్లాకు చెందిన సీఎంహెచ్‌ఓ స్పందించింది. జిల్లాలో కొని ప్రాంతాల్లో డెంటల్ సంబంధిత ఫ్లోరోసిస్ వ్యాధి ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించింది. దీని కోసం ఆరోగ్య శాఖ శిబిరాలు ఏర్పాటు చేసి తద్వారా దంత చికిత్సను అందిస్తున్నమని పేర్కొంది. ఇక్కడ నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుందని.. కనుక నీటిని ఎల్లప్పుడూ పరీక్షించాలని.. ప్రజలు వేడిచేసిన నీటిని తాగాలని సూచిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..