అమ్మాయిలూ రోడ్డు సైడ్ టాటూలు వేయించుకుంటున్నారా..? ఇది చూస్తే జన్మలో ఆ పని చేయరు
ఈ 68 మంది మహిళలలో కనీసం 20 మంది, తమకు వచ్చిన ఇన్ఫెక్షన్ టాటూల కారణంగా అయ్యిందని అనుమానిస్తున్నారు. వీరు వీధి టాటూ కళాకారుల వద్ద టాటూలు వేయించుకున్నట్లు చెప్పారు.
ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌లో 68 మంది మహిళలు HIV పాజిటివ్‌గా గుర్తించబడ్డారు. ఈ ఘటన స్థానికంగా మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ మహిళలంతా గర్భధారణ పరీక్షల సమయంలో, జిల్లా మహిళా ఆసుపత్రిలో నిర్వహించిన సాధారణ తనిఖీల్లో HIV పాజిటివ్‌గా తేలారు. ఈ 68 మంది మహిళలలో కనీసం 20 మంది, తమకు వచ్చిన ఇన్ఫెక్షన్ టాటూల కారణంగా అయ్యిందని అనుమానిస్తున్నారు. వీరు వీధి టాటూ కళాకారుల వద్ద టాటూలు వేయించుకున్నట్లు చెప్పారు. టాటూ వేయించుకున్న తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని, HIV లక్షణాలు బయటపడినట్లు వివరించారు.
ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
ఈ మహిళలు టాటూ కళాకారులపై ఆరోపణలు చేస్తూ, వారు ఒకే సూదిని పలు సార్లు ఉపయోగించారని, దీనివల్లే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిందని చెప్పారు. అంతేకాకుండా, ఈ కేసులపై వైద్యులు స్పందించారు. వారికి సురక్షిత ప్రసవ సంరక్షణ అందించబడిందని అధికారులు తెలిపారు. అయితే, టాటూల వల్ల HIV వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుండగా, టాటూ ట్రెండ్‌పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది టాటూల మోజు వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించగా, మరికొందరు మాత్రం సరైన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు ఉండవని పేర్కొన్నారు.
ఇది చదవండి:
ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..