Delhi: తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం.. ఢిల్లీలో గ్రాప్-3 అమలు.. అదేంటంటే

గాలి పీల్చుకుంటేనే మనం బతుకుతాం.. కానీ ఢిల్లీలో మాత్రం గాలి పీల్చుకుంటే బతకలేం అన్నట్టుగా పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Delhi: తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం.. ఢిల్లీలో గ్రాప్-3 అమలు.. అదేంటంటే
Delhi Pollution
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 15, 2024 | 9:30 AM

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 400 పాయింట్లకుపైగా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ చూసి ఢిల్లీ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇవి కొనసాగుతాయన్నారు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఢిల్లీలో దాదాపు 432 పాయింట్లకుపైగా వాయు కాలుష్యం పెరిగింది. ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-III’ని అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాగే ఢిల్లీ నగరంలోకి “బిఎస్-3” వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశ పై నిషేధం విధించింది. ఇక ఢిల్లీలోని రహదారులు, చెట్లపై నీళ్లు చల్లే వాహనాల సంఖ్యను పెంచింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు ఢిల్లీ వాసులు. యమునా నది ఇంకా నురగలు కక్కుతూనే ఉంది. నదిలో నీరు ఇప్పటికే విషమంయగా మారిపోయాయి. అటు ముంబైలోనూ ఢిల్లీ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. AQI ఢిల్లీ స్థాయిలో లేకపోయినా క్రమంగా పెరుగుతున్న వాయుకాలుష్యంతో ఊపిరి ఆడని పరిస్థితి వస్తోంది. నెల రోజుల్లో శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రికి వెళ్తున్నవారి సంఖ్య 20 శాతం పెరిగింది.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!