AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు మీ కోసం

కార్తీక మాసం, మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకునే వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతం నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు మీ కోసం
Special Trains For Ayyappa Devotees
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 1:57 PM

Share

కార్తీకమాసం అయ్యప్ప స్వామికి అత్యంత ఇష్టమైన మాసం. దీంతో కార్తీకమాసం నుంచి మకర జ్యోతి దర్శనం వరకూ అయ్యప్ప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అయ్యప్ప దీక్షను తీసుకున్న స్వాములు భక్తి శ్రద్దలతో ఇరుముడి కట్టి అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల చేరుకొని అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. దీంతో ముందుగా అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల మండల దీక్ష పూర్తి కానున్నది.. మరోవైపు శబరిమలలోని అయ్యప్ప స్వామీ ఆలయం తలపులు తెరచే రోజు దగ్గరకు వస్తోంది. ఈ నేపధ్యంలో అయ్యప్పను దర్శించుకోవడానికి అయ్యప్ప స్వాములు కేరళకు పయనం అవుతారు. ఈ ఏడాది వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అంచనా వేసి భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు 26 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది.

మండల దీక్ష పూర్తి చేసుకున్న స్వాముల కోసం శబరిమలకు కొట్టాయం మార్గంలో వెళ్ళే తొమ్మిది ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గతంలో ప్రకటించిన రైళ్లకు ఈ సేవలకు ఇది అదనం. ఈ మేరకు షెడ్యూల్ ను వెల్లడించింది. తెలంగాణలోని సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయంతో పాటుగా కొచ్చి వరకు ఈ స్పెషల్ రైళ్ళు నడవనున్నాయి. దీంతో తెలంగాణ నుంచి శబరిమల కు మొత్తం 26 ప్రత్యేక రైళ్లు ఈ నెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అయ్యప్ప స్వామీ భక్తులకు, యాత్రికులకు అందుబాటులో ఉండనున్నాయి.

శబరిమల ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి

రైలు నెం- (07131) రూట్: కాచిగూడ నుంచి కొట్టాయం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు : నవంబర్ 17, 24 తేదీల్లో కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి మర్నాడు సాయంత్రం 6.30 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుకుంది. ఈ ట్రైన్ కొట్టాయం నుంచి మళ్ళీ కాచిగూడ కు తిరుగు ప్రయాణంలో సమయంలో కూడా ఇవే స్టేషన్ల మీదుగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి

రైలు నెం- 07132 రూట్: కాచిగూడ నుంచి కొట్టాయం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు – నవంబర్ 18, 25 తేదీలు బయలుదేరే సమయం: కాచిగూడ నుంచి సోమవారం సాయత్రం 10.50 గంటలకు బయలుదేరి మర్నాడు కొట్టాయం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుకుంది. ఈ ట్రైన్ కొట్టాయం నుంచి బుధవారం మధ్యాహ్నం బయలు దేరి కాచిగూడ కు తిరుగు ప్రయాణం అవుతుంది.

రైలు నెం- 07133 రూట్: కాచిగూడ నుంచి కొట్టాయం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు-నవంబర్ 21, 28 బయలుదేరే సమయం – 3.40 PM (గురువారం) తిరిగి కొట్టాయం నుంచి కాచి గూడ వచ్చే సమయం – 6.50 PM (శుక్రవారం)

రైలు నెం- 07134 రూటు : కాచిగూడ నుంచి కొట్టాయం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు- ఈ నెల 15, 22, 29 బయలుదేరే సమయం – 10.30 PM (శుక్రవారం) తిరిగి కొట్టాయం నుంచి కాచి గూడ వచ్చే సమయం – 11.40 PM (శనివారం)

రైలు నెం- 07135 రూట్: హైదరాబాద్ నుంచి కొట్టాయం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు- నవంబర్ 20 , 26 తేదీలు బయలుదేరే సమయం – 12.00 PM (మంగళవారం) తిరిగి కొట్టాయం నుంచి హైదరాబాద్ వచ్చే సమయం- 4.10 PM (బుధవారం)

రైలు నెం- 07136 రూట్: కొట్టాయం -హైదరాబాద్ స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు- నవంబర్ 20 , 27 బయలుదేరే సమయం – 6.10 PM (బుధవారం) తిరిగి కొట్టాయం నుంచి హైదరాబాద్ వచ్చే సమయం – 11.45 PM (గురువారం)

రైలు నెం- 07137 రూట్ : హైదరాబాద్ – కొట్టాయం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు- నవంబర్ 15, 22, 29 బయలుదేరే సమయం – 12.05 PM (శుక్రవారం) తిరిగి కొట్టాయం నుంచి హైదరాబాద్ వచ్చే సమయం – 6.45 PM (శనివారం)

రైలు నెం- 07138 మార్గం: కొట్టాయం – సికింద్రాబాద్ స్పెషల్ రైలు ప్రయాణించే తేదీలు- ఈనెల 16, 23, 30 తిరిగి కొట్టాయం నుంచి సికింద్రాబాద్ కు తిరిగి బయలుదేరే సమయం – 9.45 PM (శనివారం) సికింద్రాబాద్ వచ్చే సమయం – 12.50 AM (సోమవారం)

రైలు నెం- 07139 మార్గం: నాందేడ్ – కొల్లాం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీ- 16 బయలుదేరే సమయం – ఉదయం 8.20 (శనివారం) కొల్లాం నుంచి నాందేడ్ తిరిగి రాక సమయం – రాత్రి 10.30 (ఆదివారం)

రైలు నెం- 07140 మార్గం: కొల్లం – సికింద్రాబాద్ స్పెషల్ రైలు ప్రయాణించే తేదీ- 18 కొల్లం నుంచి స్పెషల్ ట్రైన్ బయలుదేరే సమయం – 2.30 AM (సోమవారం) సికింద్రాబాద్ కు చేరుకునే సమయం 12.00 మధ్యాహ్నం (మంగళవారం)

రైలు నెం- 07141 మార్గం: మౌలా అలీ (హైదరాబాద్) – కొల్లాం స్పెషల్ రైలు ప్రయాణించే తేదీ- 23 , 30 మౌలా అలీ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ బయలు దేరే సమయం – 2.45 PM (శనివారం) కొల్లం కు చేరుకునే సమయం – 1.30 PM (ఆదివారం)

రైలు నెం- 07142 మార్గం: కొల్లాం – మౌలా అలీ (హైదరాబాద్) స్పెషల్ రైలు ప్రయాణించే తేదీ – నవంబర్ 25 , 2 డిసెంబర్ కొల్లాం నుంచి మౌలా అలీ కి బయలుదేరే సమయం – 2.30 AM (సోమవారం) హైదరాబాద్ లోని మౌలా అలీ కి చేరుకునే సమయం మధ్యాహ్నం 1.00 (మంగళవారం)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..