AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం.. స్పెషాలిటీ ఏమిటంటే..

తిరుపతి ప్రపంచానికి తెలిసిన ఆధ్యాత్మిక నగరం. తిరుపతి అనగానే గుర్తుకు వచ్చేది తిరుమల క్షేత్రం. వెంకన్న కొలువుదీరిన పుణ్యక్షేత్రం. అయితే ఇప్పుడు టెంపుల్ సిటీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం ఆవిష్కృతం అవుతోంది.

Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం.. స్పెషాలిటీ ఏమిటంటే..
Largest Shiva Temple
Raju M P R
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 2:45 PM

Share

కలియుగ వైకుంతం తిరుమల తిరుపతి క్షేత్రంలో మరో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఈ అద్భుత నిర్మాణం భూకైలాస్ ను తలపిస్తోంది. తిరుపతిలో ప్రముఖ దర్శనీయ స్థలంగా మారబోతోంది. భక్తులను పరవశింప చేసేలా అపురూప నంది శివలింగ మందిరం రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే మూడో ఆలయంగా రాష్ట్రంలో రెండో అతి ఎత్తైన శివ మందిరంగా నిలిచి పోనుంది. తిరుపతి లోని మంగళం వద్ద బ్రహ్మాకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నంది శివలింగ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భూమట్టం నుంచి 67 అడుగుల ఎత్తులో మరో 67 ఆడుగుల వెడల్పు చుట్టు కొలతల మధ్య మూడు అంతస్తుల్లో శివలింగ మందిరం నిర్మితమవుతోంది.

దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయ నుండగా శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ఠించనున్నారు శిల్పులు. ఇక మొదటి అంతస్తులో రాజయోగ అభ్యాసనం వీడియో షో ప్రదర్శన, ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా లిఫ్ట్ సౌకర్యం అందుబాటు లోకి రానుంది. మెట్ల సదుపాయం కూడా ఏర్పాటు కానుంది. భారీ నంది శివలింగం ముందు భాగాన శివనామాలు, మూడో నేత్రానికి సమాన ఎత్తులో మరో నిర్మాణం చేపట్టారు. దాదాపు 60 అడుగుల ఎత్తులో భారీ నంది ఏర్పాటు చేయనున్నారు. శివుని మూడో నేత్రం, నందికి సమాన కొలతతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు శిల్పులు. 24 అడగుల పొడవు, 16 అడుగుల ఎత్తుతో భారీ నంది విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు చురుగ్గా పనులు జరుగు తున్నాయి.

అయితే ఇప్పటికే పుట్టపర్తిలో 75 అడుగుల ఎత్తులో ఇదే నమూనాతో శివలింగ మందిరం ఉండగా.. తిరుపతిలో బ్రహ్మకుమారీల ఆశ్రమంలోనే మందిరం ఏర్పాటు కానుంది. ఎకరా 25 సెంట్లు విస్తీర్ణంలో ప్రశాంత, ఆహ్లాదరకర వాతావరణంలో దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో మూడంతస్తుల మందిర నిర్మాణాన్ని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. 2023 అక్టోబరులో పనులు ప్రారంభం కాగా ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయి. భక్తులను ఆకట్టుకునేలా మందిరాన్ని నిర్మించేందుకు 50 మంది శిల్పులు నిత్యం శ్రమిస్తుండగా తిరు నగరిలో కలికితురాయిగా బ్రహ్మకుమారిస్ నిర్మిస్తున్న ఆలయం ఉండబోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..