Rice For Three Times: మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?

Rice For Three Times: మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?

Anil kumar poka

|

Updated on: Nov 15, 2024 | 12:07 PM

ప్రతిరోజూ అన్నం తినడం మంచిదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..కొంతమంది రోజుకు మూడు పూటలా అన్నమే తింటారు. నిజానికి అన్నం ఎక్కువగా తినడం మంచిది కాదు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు అన్నం తినకుండా ఉండటమే బెటర్ అంటున్నారు వైద్యులు. లేదంటే రకరకాల అనారోగ్య సమస్యల భారం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ఎక్కువగా అన్నం తినడం వల్ల కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని తేలింది. అసలు అన్నం తినడం వల్లే వచ్చే సమస్యలేంటో చూద్దాం.

ఊబకాయం: చాలామంది అన్నం ఎక్కువగా తింటారు. నిజానికి ఇలా తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. అలాగే శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతం రెట్టింపు అవుతుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది.

మధుమేహం: అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి దీన్ని రోజుకు మూడుసార్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జీర్ణ సమస్యలు: అన్నం ఎక్కువగా తినడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు వస్తాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తినకుండా ఉండటమే బెటర్.

గుండె సంబంధిత వ్యాధులు: అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కాలేయ వ్యాధులు: కొందరిలో అన్నం ఎక్కువగా తినడం వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు కాలేయంపై కూడా ప్రభావం చూపుతాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాలేయం దెబ్బతినడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

శరీరం బలహీనత: ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు మాత్రమే లభిస్తాయి. దీనివల్ల శరీరానికి ప్రయోజనం ఉండదు. అలాగే పోషకాలు తగినంత పరిమాణంలో లభించవు. దీని వల్ల శరీర బలహీనత వంటి సమస్యలు, చిన్న చిన్న పనులకే తరచుగా శరీరం శక్తిని కోల్పోతుంది.

అందుకే వైట్ రైస్ తినే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఎక్కువగా తినాలనుకుంటే బ్రౌన్ రైస్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఒకప్పుడు ఎంత అన్నం తిన్నా తగిన శారీరక శ్రమ ఉండేది. దానికి తోడు ఇప్పుడు చేసినంత పాలిష్ బియ్యానికి చేసే వారు కాదు. దాని వల్ల కేవలం కార్బొహైడ్రేట్లు మాత్రమే కాకుండా పైన ఉండే పొట్టువల్ల శరీరానికి ఫైబర్ కూడా అందేది. కానీ ఇప్పుడు పూర్తిగా పొట్టులేని బియ్యాన్నే తింటున్నాం. దీంతో అన్నం తినడం వల్ల పిండి పదార్థం తప్ప శరీరానికి మరే ఇతర లాభం ఉండటం లేదు. అందుకే వయసులో ఉన్న వారు ఎలా తిన్నా ఫర్వాలేదు కానీ 60 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం అన్నాన్ని ఒక క్రమ పద్ధతిలో మాత్రమే తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.