తరచూ బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నారా..? ఇది తెలిస్తే గుండె గుబేల్..!
ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచం నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటున్నారు. అయితే అందంతో పాటు చర్మ సంరక్షణ కూడా ముఖ్యం. థ్రెడింగ్ అనేది అత్యంత సాధారణ సౌందర్య ప్రక్రియలలో ఒకటి. అయితే బ్యూటీ పార్లర్ కి వెళ్ళే సమయంలో కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని.. పార్లర్‌లో పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్ కారణంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఫ్యాషన్ గా ఉండడం అందరికీ ఇష్టమే.. ఫ్యాషన్ అంటే అందంగా కనిపించడం. మేకప్ లేదా దుస్తులు మాత్రమే కాదు చర్మ సంరక్షణ కూడా ఫ్యాషన్‌లో భాగంగా పరిగణించబడుతుంది. అందుకనే నేటి యువత బ్యూటీ పార్లర్ ని ఆశ్రయిస్తున్నారు. థ్రెడింగ్, వ్యాక్సింగ్, క్లెన్సింగ్, ఫేషియల్, బ్లీచ్, పెడిక్యూర్-మానిక్యూర్ వంటి రకరకాల స్కిన్ కేర్ పద్దతులను పాటిస్తారు. ఇలా చేయించుకోవడం వలన మొత్తం శరీరం శుభ్రపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
వీటన్నింటిలో థ్రెడింగ్ అనేది చాలా మంది చేయించుకునే సాధారణ ప్రక్రియ. వాస్తవంగా థ్రెడింగ్ కాలేయానికి హాని కలిగించదు. అయితే పార్లర్‌లోని చాలా మంది కస్టమర్లకి ఒకే థ్రెడ్‌ను ఉపయోగించినా లేదా శానిటైజింగ్ టూల్స్, చేతులు కడుక్కోవడం వంటి ప్రాథమిక పరిశుభ్రతను విస్మరించినా అపుడు థ్రెడింగ్ కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు డాక్టర్ చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం..
కనుబొమ్మల థ్రెడ్డింగ్ తర్వాత కాలేయ వైఫల్యం
కనుబొమ్మల థ్రెడ్డింగ్ తర్వాత ఒక మహిళ కాలేయ వైఫల్యానికి గురైన కేసు ఉంది. డాక్టర్ అదితి ధమిజా (MBBS) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఈ విషయాన్నీ చెబుతూ హెచ్చరించారు. 28 ఏళ్ల మహిళ కనుబొమ్మల థ్రెడ్డింగ్ కోసం స్థానిక పార్లర్‌కు వెళ్లిందని, కొన్ని రోజుల తర్వాత ఆమెకు కాలేయ వైఫల్యం వచ్చిందని ఆమె చెప్పారు. దీనికి కారణం వైరల్ హెపటైటిస్. ఈ వైరస్ థ్రెడింగ్ కోసం ఉపయోగించిన దారం నుంచి వ్యాపించి ఉండవచ్చని చెప్పారు. ఇది విన్న వారికి వింతగా అనిపించవచ్చు. ఇది భయం మాత్రమే కాదు.. థ్రెడింగ్ వల్ల కాలేయానికి హాని కలిగించే వైరస్ వస్తుందా అని ఆలోచిస్తున్నారా? ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ.. పార్లర్‌లో శుభ్రత పాటించకపోతే ఇలా జరగవచ్చని అన్నారు.
వైరస్‌లు శరీరంలోకి ఎలా చేరుతాయి?
థ్రెడ్డింగ్ చేసే సమయంలో చర్మంపై చాలా చిన్న కోతలు లేదా గీతలు ఏర్పడతాయని. దీనివల్ల హెపటైటిస్ బి లేదా సి వంటి రక్తం ద్వారా సంక్రమించే వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. ఈ వైరస్‌ల శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలను చూపించవు. నిశ్శబ్దంగా కాలేయాన్ని సంవత్సరాల తరబడి దెబ్బతీస్తాయని చెబుతున్నారు. సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే ఈ వ్యాధి తీవ్రమైన రూపాన్ని తీసుకోవచ్చు.
View this post on Instagram
ఏ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందంటే
- కామెర్లు
- కాలేయం వాపు
- దీర్ఘకాలిక హెపటైటిస్
- కాలేయ వైఫల్యం
- కాలేయ క్యాన్సర్
థ్రెడ్డింగ్ ప్రమాదకరం కాదు. అయితే పార్లర్‌లో వేర్వేరు వ్యక్తులకు ఒకే థ్రెడ్‌ను ఉపయోగిస్తుంటే లేదా పరిశుభ్రత పాటించకపోతే ప్రమాదం పెరుగుతుంది. హెపటైటిస్ వైరస్ శరీరం వెలుపల కూడా చాలా కాలం జీవించగలదు.
థ్రెడింగ్ చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటే
- ప్రతిసారీ కొత్త దారాన్ని ఉపయోగించాలి.
- పార్లర్ లో చాలా పరిశుభ్రంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- థ్రెడ్డింగ్ చేసే వ్యక్తి ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. లేదా శానిటైజ్ చేసుకోవాలి లేదా చేతి గ్లౌస్ ధరించడా లేదా అనే విషయాలను గమనించాలి.
- హెపటైటిస్ బి నివారణకు తగిన టీకాలు వేయించుకోవాలి.
- అలసట, కళ్ళు పసుపు రంగులోకి మారడం లేదా ముదురు రంగు మూత్రం వంటి శరీర సంకేతాలను గమనిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








