AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Health: నవజాత శిశువులకు ఎండ తగిలేలా ఎందుకు చేస్తారో తెలుసా.?

నవజాత శిశువులను పట్టుకొని పెద్దలు ఎండలో కూర్చునే దృశ్యాలను మనం చూసే ఉంటాం. ఇలా ఎండలో చిన్నారులను ఉంచడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? చిన్నారులను ఎండలో ఉంచే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

Kids Health: నవజాత శిశువులకు ఎండ తగిలేలా ఎందుకు చేస్తారో తెలుసా.?
Kids Health
Narender Vaitla
|

Updated on: Nov 28, 2024 | 5:22 PM

Share

అప్పుడే పుట్టిన శిశువులను పట్టుకొని పెద్దవాళ్లు ఎండలో కూర్చుంటారు. ఆసుపత్రుల బయట ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే చిన్నారులను ఇలా ఎండకు చూపించడం వెనకాల ఎంతో శాస్త్రీయత దాగి ఉందని మీకు తెలుసా.? ఇంతకీ చిన్నారులకు ఎండ తగిలేలా ఎందుకు చేస్తారు.? ఇలా చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నవజాత శిశువులకు లేలేత కిరణాలు తగిలేలా ఎండలో ఉంచితే అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి దూరం కావొచ్చు. అయితే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య వచ్చే ఎండలో మాత్రమే ఇలా చేయాలని నిపునులు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఎండ చిన్నారుల్లో సమస్యలకు దారి తీస్తుంది. అదే విధంగా కేవలం 15 నుంచి 30 నిమిషాలు మాత్రం ఎండలోకి తీసుకెళ్లాలి.

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్యరక్ష్మి పడితే శరీరానికి విటమిన్‌ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రక్ష్మి ఎంతో మేలు చేస్తుంది. సూర్యరక్ష్మి తగిలేలా చేయడం వల్ల పిల్లల మెదడు సైతం అభివృద్ధి చెందుతుంది. ఇది మెదడులో సెరోటోనెర్జిక్ చర్యను పెంచుతుంది. సెరోటోనిన్ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడానికి పనిచేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు. సూర్యరశ్మి బిలిరుబిన్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో తేలింది. కాబట్టి కామెర్లు వచ్చే సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

నవజాత శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి. సూర్యరక్ష్మి వల్ల వారి చర్మం ఎర్రబడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా ఎండ తగిలేలా కాకుండా చీర కొంగు లేదా పల్చట్‌ టవల్ అడ్డుగా పెట్టాలి. ఇక ఎండలో ఉంచితే చిన్నారుల్లో డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగినంత తల్లి పాలు అందించాలి. కళ్లపై నేరుగా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఎక్కుసేపు ఎండకు ఎక్స్‌పోజ్‌ అయితే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..