PM Modi: భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. తాను విదేశీ పర్యటనలో భాగంగా పర్యటించే సమయంలో అక్కడి ప్రజలు భారతీయ సంస్కృతిని ఉట్టి పడేలా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మోదీ.. భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు...
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర దేశాల్లో స్థిరపడ్డా భారతీయులు మన సంస్కృతిని, సంప్రదాయాలను మాత్రం వీడడం లేదు. మన పండుగలను విదేశాల్లో జరుపుకుంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ విషయమై ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఆయనను కలవడానికి వస్తుంటారు. ఎయిర్ పోర్ట్‌లో మోదీ నామం మారు మోగే సందర్భాలు కూడా ఎన్నో చూసే ఉంటాం. ఇక భారతీయత ఉట్టిపడేలా అక్కడి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను తాజాగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ వీడియోతోపాటు.. ‘భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది! నేను ఎక్కడికి వెళ్లినా, మన చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇది చాలా సంతోషకరం’ అంటూ రాసుకొచ్చారు. మోదీ షేర్ చేసిన వీడియోలో.. ఆస్ట్రీయాకు చెందిన సంగీత కళాకారులు రకరకాల ఇస్ట్రుమెంట్స్‌తో ‘వందేమాతరం’ గీతాలపన చేయడం. పొలాండ్ మాస్కోలో గార్భా డ్యాన్స్, భూటాన్‌లో దాండియా.. ఇలా ఆయా దేశాల్లో భారతీయ సంస్కృతిని ఉట్టి పడేలా చేపట్టిన ఈవెంట్స్ ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

