AP News: నిర్మానుష్య ప్రదేశంలోకి డ్రోన్ పంపిన పోలీసులు.. చెట్ల పోదల మాటున చిక్కారుగా

AP News: నిర్మానుష్య ప్రదేశంలోకి డ్రోన్ పంపిన పోలీసులు.. చెట్ల పోదల మాటున చిక్కారుగా

Ram Naramaneni

|

Updated on: Nov 28, 2024 | 2:50 PM

బ్లేడ్‌ బ్యాచ్‌..గంజాయి గ్యాంగ్‌.. తాగుబోతులు ముఠా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసుల డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు. ఇదిగో ఈ వీడియో చూడండి.....

బ్లేడ్‌ బ్యాచ్‌..గంజాయి గ్యాంగ్‌.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు.

డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్‌ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు చెక్ పెడుతున్నారు. అనంతపురం శివారు ప్రాంతాల్లో ఆకతాయుల ఆట కట్టించేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు పోలీసులు.
పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో తాగేస్తున్న మందుబాబులకు దడ పుట్టిస్తున్నారు. గంజాయి మత్తులో జోగుతున్న వ్యక్తుల భరతం పడుతున్నారు. తాజాగా ఆకాశంలో నుంచి ఒక్కసారిగా దూసుకువచ్చిన డ్రోన్లను చూసి  తాగుబోతులు, పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. శివారు కాలనీల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న.. నిందితులపై నాలుగు కేసులు నమోదు చేశారు. నేరాల నియంత్రణకు డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు ఏపీ పోలీసులు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మున్ముందు వణుకుపుట్టించేలా యాక్షన్‌ ఉంటుందంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 28, 2024 02:49 PM