- Telugu News Photo Gallery Technology photos These are the best phones for non stop gaming, Best brands at low prices, Best gaming phones details in telugu
Best gaming phones: నాన్ స్టాప్ గేమింగ్ కు బెస్ట్ ఫోన్లు ఇవే.. తక్కువ ధరకే బెస్ట్ బ్రాండ్లు
ఆన్ లైన్ గేమ్స్ ఆడడం చాలామందికి ఇష్టమైన హాబీ. ప్రయాణం చేస్తున్నా, పనిలో తీరిక దొరికినా వారికి ఇష్టమైన గేమ్ ను ఆన్ చేస్తారు. ఇలాంటి గేమ్స్ లవర్స్ మనకు చాలాచోట్ల కనిపిస్తారు. అయితే సాధారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్లు గేమింగ్ కు పనికిరావు. వీటిలో ఆటలు ఆడితే తరచూ అంతరాయాలు జరుగుతాయి. గేమింగ్ కోసం మంచి ర్యామ్, ప్రాసెసర్, డిస్ ప్లే ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ బ్యాకప్ ఇచ్చే బ్యాటరీ అత్యవసరం. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ బ్రాండ్లు గేమింగ్ కోసం ప్రత్యేక స్మార్టు ఫోన్లు విడుదల చేశాయి. అత్యంత నాణ్యమైన పనితీరు కనబరిచే వీటిని అమెజాన్ లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Updated on: Nov 28, 2024 | 4:45 PM

సీఎంఎఫ్ ఫోన్ 1 గేమింగ్ ఇష్టమైన వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. అవాంతరాలు లేకుండా సుదీర్ఘంగా బ్యాటరీ పనిచేస్తుంది. దీంతో గేమింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. నథింగ్ కు చెందిన ఉప బ్రాండ్ అయిన సీఎంఎప్ ఫోన్ 1 అమెజాన్ లో రూ.15 వేలకు అందుబాటులో ఉంది.

మోటో జీ64 గేమింగ్ ప్రేమికుల కోసం రూపొందించిన ఫోన్లలో ఇది ఒకటి. సుధీర్ఘ గేమింగ్ కోసం దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. దీనివల్ల ఆటకు మధ్యలో అంతరాయం కలుగుతుందనే టెన్షన్ ఉండదు. మీడియా టెక్ డైమెన్సిటీ 7025, 8 జీబీ ర్యామ్ తో ఫోన్ పనితీరు చాాలా సమర్థంగా ఉంటుంది. టర్బో చార్జింగ్ తో వేగవంతంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మోటో జీ64ను అమెజాన్ లో రూ.15,574కు కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎక్స్ 6 నియో ఈ ఏడాది మార్కెట్ లోకి వచ్చింది. గేమింగ్ కు అనుకూలంగా దీన్ని రూపొందించారు. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్, 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కారణంగా గేమింట్ సమయంలో అంతరాయాలు ఉండవు. ఈ ఫోన్ ను అమెజాన్ లో రూ.12,998కి సొంతం చేసుకోవచ్చు.

పెద్ద డిస్ ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్ లో రెడ్ మీ 13 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది. కొనుగోలుదారులకు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్, 6 జీబీ ర్యామ్, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ అదనపు ప్రత్యేకతలు. తక్కువ ధరకు లభించే మెరుగైన ఫోన్ ఇది. అమెజాన్ లో రూ.12,538కు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఆధునాతన గేమింగ్ సామర్థ్యంతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఏర్పాటు చేశారు. గేమింగ్ సమయంలో అవాంతరాలు లేకుండా పనిచేసే ఫోన్లలో ఇది ఒకటి. ఈ ఫోన్ రూ.15 వేలకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.




