- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on Samsung Galaxy S23 FE smart phone
Samsung Galaxy S23 FE: కళ్లు చెదిరే డిస్కౌంట్.. రూ. 80 వేల ఫోన్ రూ. 34 వేలకే..
ఈ కామర్స్ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు సమయంతో సంబంధం లేకుండా ఆఫర్లు అందిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇలాంటి ఓ బెస్ట్ ఆఫర్ లభిస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌పై లభిస్తోన్న ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 28, 2024 | 9:30 PM

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 79,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 34,939కే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ డిస్కౌంట్ ఇక్కడితే ఆగిపోలేదు. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 33,939కే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ. 32,700 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్‌ఈడీ 2 ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్ ఎక్స్ నోస్ 2200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌తో కూడిన 50 మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ ఫోన్ నైటోగ్రఫీ మద్దతుతో అడ్వాన్స్డ్ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వీడీఐఎస్), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)లతో కూడిన కెమెరా సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత.




