కళ్ళు మన శరీరంలో అత్యంత కీలకమైనవి. కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కళ్లు ఆరోగ్యంగా ఉంటే చూపు స్పష్టంగా ఉంటుంది. మన కంటిచూపే మన అభివృద్ధికి మెట్టు.
TV9 Telugu
కంటి చూపు మందగించడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కంటి సమస్యలు తలెత్తినప్పుడు, దృష్టి లోపాలు ఏర్పడినపుడు వెంటనే కళ్లజోడు, కాంటాక్ట్ లెన్సులు తప్పవు.
TV9 Telugu
క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. విటమిన్ ఏ కంటిచూపునకు తోడ్పడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది.
TV9 Telugu
క్యారెట్, నారింజ, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, సీ ఫుడ్స్, బచ్చలికూర ఆరోగ్యాన్ని అందిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్లు ఆకు కూరల్లో పుష్కలంగా ఉంటాయి.
TV9 Telugu
కళ్లను చీటికిమాటికి నలపడం, రుద్దడం చేయరాదు. అలా చేస్తే కంటి ఉపరితలం దెబ్బతింటుంది. కార్నియా బలహీనంగా మారుతుంది. దురదగా ఉంటే చల్లని నీటితో కళ్లను వాష్ చేసుకోవాలి.
TV9 Telugu
కళ్లను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. ఇందుకోసం కావాల్సినన్నీ మంచినీరు తాగటం అలవాటు చేసుకోవాలి. మనం తక్కువ నీరు తాగితే ప్రభావం కండరాల చురుకుదనం తగ్గుతుంది.
TV9 Telugu
చక్కటి కంటి ఆరోగ్యానికి కూరగాయలు కూడా మేలు చేస్తాయి. చిలగడదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, లుటిన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
TV9 Telugu
చేపలలో ఒమేగా -3 కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో ఉండే కోకో కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది.