AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: సింపుల్ కాదు గురూ.. ధనుష్ వాచ్ ధర తెలిస్తే మెంటలెక్కిపోద్ది.. ఎంతంటే..

తెల్ల చొక్కా.. పంచెకట్టులో ఎంతో సింపుల్ అండ్ స్టైలీష్ లుక్‍లో కనిపిస్తూనే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటాడు. కల్మషం ఎరుగని చిరునవ్వుతో అభిమానులను కట్టిపడేస్తుంటాడు. అతడికి పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఆ హీరో వాచ్ ధర తెలిసి నోరెళ్లబెడుతున్నారు ఫ్యాన్స్.

Dhanush: సింపుల్ కాదు గురూ.. ధనుష్ వాచ్ ధర తెలిస్తే మెంటలెక్కిపోద్ది.. ఎంతంటే..
Dhanush
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2024 | 5:17 PM

Share

కోలీవుడ్ హీరో ధనుష్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ గత కొన్ని రోజులుగా ధనుష్ వ్యక్తిగత జీవితం గురించి ఏదోక వార్త వినిపిస్తూనే ఉంది. ఇటీవల హీరోయిన్ నయనతార సైతం ధనుష్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే తనపై నయన్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ధనుష్ సైలెంట్ గానే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ధనుష్ కోలీవుడ్ నిర్మాత ఆకాష్ భాస్కర్ వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఎవరి కార్యక్రమాలకు రాని ధనుష్ ఈ పెళ్లి వేడుకకు రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇదే వేడుకకు నయన్ తన భర్తతో కలిసి హాజరయ్యింది. ధనుష్‌పై నయనతార ఇంత పెద్ద ఆరోపణలు చేసి వారం కూడా గడవకుండానే వీరిద్దరి మధ్య జరిగిన అనూహ్య భేటీ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈవేడుకలో ధనుష్, శివకార్తికేయన్ మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది.

వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు గతంలో అనేక సార్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ పెళ్లి వేడుకలో ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అయితే ఈ వేడుకలో ధనుష్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తెల్ల చొక్కా, పంచెకట్టులో ఎంతో సింపుల్ గా వచ్చిన ధనుష్ ధరించిన వాచ్ మాత్రం హైలెట్ అయ్యింది. దీంతో ఆ వాచ్ ధర కోసం గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.

నివేదికల ప్రకారం.. ధనుష్ ధరించిన వాచ్ పేరు రోలెక్స్ డే-డేట్. దీని ధర రూ.1,35,09,000గా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే 1.35 కోట్లు అన్నమాట. దీంతో ధనుష్ వాచ్ అమ్మెస్తే చాలు సెటిల్ అయిపోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!