Thati burra gujju: పోషకాల గని తాటి బుర్రగుంజు.. కార్తీక మాసం స్పెషల్.. మిస్‌చేసుకోకండి..

తాటి చెట్టును  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కల్పవృక్షమని ఎందరో కవులు పలు సందర్భాల్లో అభివర్ణించారు. ఇందుకు కారణం కూడా ఉంది..ఎందుకంటే తాటి చెట్టులోని ప్రతి భాగము ఉపయోగకరమైనది కాబట్టే తాటి చెట్టును కల్పవృక్షంగా కవులు వర్ణిస్తారు.  అలాంటి తాటి చెట్టు పిందె దశ నుండి చివరి దశ వరకు ప్రతిదీ మనకు పోషకాహారాన్ని అందించేదిగా చెబుతారు. అందులో ఒకటి తాటి బుర్రగుంజు..

Thati burra gujju: పోషకాల గని తాటి బుర్రగుంజు.. కార్తీక మాసం స్పెషల్.. మిస్‌చేసుకోకండి..
Thati Burra Gujju
Follow us
Pvv Satyanarayana

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 28, 2024 | 5:15 PM

తాటి పిందె దశలో కల్లును, 2వ దశలో రుచికరమైన ముంజులను,3వ దశలో అమోఘమైన సువాసనతో రుచికరమైన తాటి పండ్లను, చివరి దశలో తాటి బుర్ర నుండి గుంజు రుచికి రుచి అమోఘమైన పోషకాల గని. అందుకే పల్లెటూరు వాసులకు ఏడాదికి ఒకసారి దొరికే పోషకాల గని. బుర్రగుంజులో తక్కువ క్యాలరీస్ ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని చెబుతారు. తాటిబుర్ర గుంజు తీపితనం తక్కువ, కమ్మదనం ఎక్కువగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

పల్లెటూర్లలో నాగుల చవితి వచ్చిందంటే తేగలతో పాటు, తాటి బుర్రగుంజును కూడా అమృతంలా లాగించేస్తుంటారు. పూర్వికులు ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడని బుర్ర గుంజును తినడం వల్లే నూటికి నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతికే వారని మన పెద్దలు చెబుతున్నారు.

నేడు పల్లెటూరి వాసులకు దొరికే అమృతం లాంటి తాటి బుర్ర గుంజు ఈ మధ్యకాలంలో హైవేల పక్కన అమ్మడం విశేషం… సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి బుర్ర గుంజును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పల్లెటూర్లలో అయితే పొలం గట్లలో వేసిన తాటికాయలు బుర్రగుంజులా మారి.. తర్వాత తేగలుగా విక్రయిస్తుంటారు. బుర్రగుంజులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వారానికి ఒకసారి గానీ, వారానికి మూడు రోజులు గాని తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉండడం వల్ల వీటిని తినమని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌