Bollywood: బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్స్.. బాలీవుడ్ పతనానికి ఆ పెద్దలే కారణమా.. ?

బాలీవుడ్.. ఒకప్పుడు అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ. జాతీయ స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు. మరెన్నో బయోపిక్స్. కానీ ఇప్పుడు సినీప్రియులకు నిత్యం నిరాశను మిగులుస్తున్న దర్శకనిర్మాతలు. కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద బీటౌన్ సినిమాలు అంతగా విజయం సాధించడం లేదు. స్టార్ హీరోల సినిమాలైనా డిజాస్టర్స్ అవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఆ పెద్దలేనా ? అసలు విషయాలు తెలుసుకుందాం.

Bollywood: బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్స్.. బాలీవుడ్ పతనానికి ఆ పెద్దలే కారణమా.. ?
Akshay Kumar - John Abraham
Follow us
Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 28, 2024 | 5:09 PM

2024.. ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. సినీరంగంలోకి టాప్ హీరోలు.. పెద్ద డైరెక్టర్స్ తీసిన అతిపెద్ద బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ప్రతినెలా నార్త్ సినీ ప్రియులకు నిరాశనే కాకుండా బీటౌన్ పరిస్థితి మరింత దిగజారింది. కానీ ఇటీవల విడుదలైన స్త్రీ 2, ముంజ్యా, షైతాన్ చిత్రాలు కొద్ది వరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరినిచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీస్ ఘన విజయం సాధించడమే కాకుండా భారీగా వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమాలు లేకపోతే బాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే బాక్సాఫీస్ వద్ద బీటౌన్ పతనానికి కారణం ఎవరు.. ?

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఎక్కువగా కంటెంట్, విశ్లేషణ లోపించడమే కాదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అని పిలవబడే స్టార్ హీరోస్ డిమాండ్ చేస్తున్న పారితోషికాలే ఇందుకు ప్రధాన కారణం. అగ్ర నటీనటుల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా నిర్మాతలపై మరింత భారం పడుతుంది. తారలు తీసుకునే పారితోషికం కారణంగా సినిమాకు సంబంధించిన కీలకమైన విభాగాల నుంచి డబ్బు కట్ చేయాల్సి వస్తుంది. దీంతో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన పనుల నాణ్యత తగ్గుతుంది. పారితోషికాల్లో విభిన్నత ఫలితం సినిమాపై పడుతుంది. దీంతో ఇటు ప్రేక్షకులకు నిరాశకు గురవుతున్నారు.

బడే మియాన్ చోటే మియాన్..

ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటి. కానీ మీకు తెలుసా.. ? ఈ సినిమా ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటి. ఈ మూవీ కోసం హీరో అక్షయ్ కుమార్ దాదాపు రూ.165 కోట్లు పారితోషికం తీసుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.111.49 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు తీవ్ర నష్టాలు వచ్చాయి. ఈ సినిమా స్క్రిప్ట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగానే విఫలమైంది. సూపర్ స్టార్ నటిస్తేనే సినిమా విజయం సాధిస్తుంది అనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయం మారింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రాక.. పాన్ ఇండియా లెవల్లో సౌత్ మూవీస్ ఆధిపత్యంతో అడియన్స్ విభిన్న కంటెంట్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే సినిమాలోను ఇదే తప్పు జరిగింది. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లతో నిర్మిస్తే హీరో అక్షయ్ రూ.65 కోట్లు తీసుకున్నాడు. కానీ ఈ మూవీ కేవలం రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో మరోసారి నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు.

హిందీలో వచ్చిన వేదా, సర్ఫిరా, మైదాన్ వంటి చిత్రాల్లో సైతం ఇలాంటి తప్పులే జరిగాయి. కానీ దక్షిణాది సినిమాలు ఇందుకు చాలా విభిన్నం. ఇక్కడ నటుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత కథకు ఉంటుంది. బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలు స్టార్ హీరోల క్రేజ్ కాకుండా కథను ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని సాధించాయి అని చెప్పడానికి ఉదాహరణలు. ఇప్పుడు హిందీ సినిమాకు కావాల్సింది కూడా ఇదే. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన లాపాటా లేడీస్ సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ మూనీ పాన్ ఇండియా అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అంతేకాకుండా ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ పెద్దలకు ఒక పెద్ద పాఠమే. కథ.. ఆ కథను వివరించే విధానం.. ప్రేక్షకులను అభిరుచి గురించి ప్రతి దర్శకనిర్మాత గమనించాలి. ఇక్కడ స్టార్ హీరోలకు భారీగా రెమ్యునరేషన్స్ అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరిగి బాక్సాఫీస్ వద్ద పూర్వ వైభవాన్ని పొందాలంటే స్టార్ పవర్, క్రేజ్ కంటే ఎక్కువగా కథకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీటౌన్ పెద్దలు గ్రహించాలి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో