Carrot Oil: క్యారెట్ విత్తనాలతో చేసే నూనెతో ఎన్నో ప్రయోజనాలు.. చర్మం, ముఖం వచ్చే సమస్యలను తగ్గిస్తాయట..
Carrot Seeds Oil: ప్రస్తుత ఆధునిక కాలంలో ముఖం వచ్చే మొటిమలు, మచ్చలు, అలాగే చర్మ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు
Carrot Seeds Oil: ప్రస్తుత ఆధునిక కాలంలో ముఖం వచ్చే మొటిమలు, మచ్చలు, అలాగే చర్మ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు చాలా మంది. వీటిని తగ్గించడం కోసం ముందుగా హోం రెమిడీస్ ఉపయోగించి.. ఆతర్వాత డాక్టర్లను సంప్రదిస్తుంటారు. అయితే మరికొంత మందికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. చర్మ సమస్యలను, ముఖం పై ఏర్పడే మొటిమల సమస్యలను తగ్గించడానికి క్యారెట్ నూనె ఎంతో ఉపయోగపడుతుంది. స్వచ్చమైన నూనెలలో ఒకటి క్యారెట్ ఆయిల్. దీంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెను ఉపయోగం గురించి పురాతనంలో గ్రీకు, రోమన్, ఈజిప్టు భాషలలో ఎక్కువగా ప్రస్తావించబడింది. మంటను తగ్గించడానికి ఈ నూనెను ఎక్కువగా వాడేవారు.
ప్రయోజనాలు..
1. మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఈ క్యారెట్ ఆయిల్ ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కువగా ఆరోమాథెరపీలో ఎక్కువగా వాడుతుంటారు. దీంతో ఆందోళన, ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. 2. యాంటీ ఆక్సిడెంట్స్.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ వ్యాధులను నివారిస్తుంది. 3. యాంటీ బాక్టీరియల్.. ఇది ఎక్కువగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా చర్మంపై ఉండే చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. ఈ నూనెను చర్మానికి ఎలాంటి హాని ఉండదు. 4. మంట సమస్య.. ఇది మంట మంట సమస్యను తగ్గిస్తుంది. ఈ నూనె శోథ నిరోదక లక్షణాలను తొలగించడమే కాకుండా.. మొటిమలను తగ్గిస్తుంది.
క్యారెట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి…
1. ఆరోమాథెరపీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. క్యారెట్ ఆయిల్ 5 నుంచి 10 చుక్కలను వేడినీరులో వేసి బాగా కలపాలి. 2. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి పక్కన పెట్టాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసి. అందులో 8 చుక్కల క్యారెట్ ఆయిల్ వేసి 20 నిమిషాలు ముఖం మీద రాయాలి. ఇది చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. 3. ఫేస్ ప్యాక్.. ముల్తానీ మట్టిలో 1 టేబుల్ స్పూన్, 1 క్లే కలబంద జెల్, 2 చుక్కల క్యారెట్ ఆయిల్ వేసి మిశ్రమంలా తయారు చేయాలి. దీనిని ఫేస్ పై అప్లై చేసుకోవాలి.
గుర్తుంచుకోవాలసిన విషయాలు..
1. క్యారెట్ సీడ్ ఆయిల్ ఇతర నూనెలతో సమానంగా ఉంటుంది. ఇతర పదార్థాలు, లేదా ఇతర నూనెలతో కలిపి నేరుగా వాడకూడదు. ఈ నూనెను తినకూడదు. 2. ఇది కేవలం బాహ్య సమస్యలకు (చర్మ సమస్యలకు) మాత్రమే అనుకూలంగా ఉంటుంది.