AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot juice: రక్తహీనత, జ్ఞాపకశక్తి అన్నింటికీ ఒకటే మందు అదే బీట్ రూట్ జ్యూస్.. ఏ సమయంలో తీసుకోవాలంటే

Beetroot juice:శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది స్పెషల్ ప్లేస్. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఎంతో మంచిది. ఎనీమియాతో..

Beetroot juice: రక్తహీనత, జ్ఞాపకశక్తి అన్నింటికీ ఒకటే మందు అదే బీట్ రూట్ జ్యూస్.. ఏ సమయంలో తీసుకోవాలంటే
Beetroot Juice
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2021 | 10:13 AM

Beetroot juice:శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది స్పెషల్ ప్లేస్. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఎంతో మంచిది. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు. పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు:

* బీట్‌ రూట్ లో మనిషికి కావాల్సిన అనేక పోషకాలున్నాయి . ఐరెన్ తక్కువగా ఉంటే రక్తహీనతకు గురవుతారు. బీట్‌ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. * నీరసంతో బాధపడేవారు కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా తక్షణ శక్తి వస్తుంది. * బీట్ రూట్‌ లో విటమిన్స్ మెండు. ముఖ్యంగా బీ సీ విటమిన్స్ అధికంగా ఉన్నాయి. బీపీ నియంత్రణలో ఉండేందుకు బీట్ రూట్ బాగా దోహదం చేస్తుంది. బీట్ రూట్‌లో కాల్షియంతో , మెగ్నిషియం, పొటాషియంలు కూడా అధికంగా వుంటాయి. ఇవన్నీ ప్రతి మనిషికి చాలా అవసరం. *తరుచూ బీట్ రూట్ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెప్పారు. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. *రోజూ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అధిక ఫ్యాట్ తో ఇబ్బందిపడేవారు రూట్ జ్యూస్ తాగితే కొవ్వు కరుగుతుంది. *బీట్ రూట్ జ్యూస్ తాగితే ఉల్లాసంగా ఉండగలుగుతారు. మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉండండి. మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. *బీట్ రూట్ గర్భిణీలకు చాలా మంచిది. ప్రెగ్నెంట్స్ కు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ మొత్తం కూడా బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది. * కాలేయాన్ని బీట్ రూట్ శుభ్రపరుస్తుంది. * చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు. \ *ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంటుంది. *రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బ్రెయిన్ కావాల్సిన బ్లడ్ సప్లై అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్ రూట్ కు ఉంది.