Sedentary Lifestyle: శారీరక శ్రమలేని జీవనం గడుపుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే! ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Madhu

Madhu | Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2023 | 6:46 PM

అస్సలు శారీరక శ్రమ లేదా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. ఎక్కువగా శరీరం కదలకుండా జీవనం సాగించే వారిని అనేక రోగాలు చుట్టుముడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కనీస వ్యాయామం చేయకపోవడం వారి ప్రమాదాన్ని మరింత పెంచతున్నట్లు వివరిస్తున్నారు.

Sedentary Lifestyle: శారీరక శ్రమలేని జీవనం గడుపుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే! ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Healthy Life Style

మీరు కూర్చొని పని చేసే ఉద్యోగం చేస్తున్నారా? గంటల కొద్దీ కూర్చున్న చోటు నుంచి లేవ కుండా పనిచేస్తున్నారా? అస్సలు శారీరక శ్రమ లేదా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. ఎక్కువగా శరీరం కదలకుండా జీవనం సాగించే వారిని అనేక రోగాలు చుట్టుముడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కనీస వ్యాయామం చేయకపోవడం వారి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నట్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ వంటివి ఇలాంటి జీవన శైలి ఉన్న వారికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు నిశ్చల జీవన శైలి ఉన్న వారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు చూద్దాం..

శారీరక శ్రమ, కోవిడ్ కి లింకేంటి..

అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం శారీరక శ్రమ, కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ మధ్య అనుబంధాన్ని గుర్తించింది. దీని కోసం 2020 జనవరి 1, 2021 నుంచి మే 31 మధ్య సానుకూల COVID-19 నిర్ధారణ అయిన సదరన్ కాలిఫోర్నియా వయోజన రోగుల నుండి డేటాను తీసుకొని అధ్యయనం చేసింది. దీనిలో శారీరక శ్రమ ఉన్న వారు, లేని వారి మధ్య కోవిడ్ లక్షణాలు, వారి ఇబ్బందులను బేరీజు వేసింది. ఈక్రమంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వారు కోవిడ్ ను తేలిగ్గా ఎదుర్కొన్నట్లు గుర్తించింది. నిశ్చల జీవనశైలి ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేసినట్లు గమనించింది. తద్వారా వారు కోవిడ్ వల్ల ఇబ్బందులు పడినట్లు నిర్ధారిచింది. ఈ నేపథ్యంలో అందరూ శారీరక శ్రమ కలిగి ఉంటే కోవిడ్ ను పూర్తిగా జయించవచ్చని స్పష్టం చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

శారీరక శ్రమ లేకపోతే కష్టం..

శారీరక శ్రమ లేని వారిలో స్థూలకాయం, స్లీప్ అప్నియా సిండ్రోమ్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపర్‌లిపిడెమియా, వివిధ మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్‌లు, కరోనరీ ఆర్టరీ డిసీజ్,పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వంటి అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మరీ రోజూ కూర్చొని, అస్సలు శారీరక శ్రమ లేని వారు ఏం చేయాలి? ఇదిగో ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆ వివరాలు చూద్దాం..

రెగ్యులర్ వ్యాయామం.. కనీసం వారానికి 5 రోజులు రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చురుకైన నడక, పరుగు, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ వ్యాయామాలు చేయవచ్చు. ఒక క్రమమైన వ్యాయామ విధానంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు.

లిఫ్ట్ వద్దు.. నడక ముద్దు.. లిఫ్ట్‌లకు బదులుగా మెట్లు ఎక్కడం లేదా మీ వాహనాన్ని మీ ఆఫీసు ముందు ఒకటి లేదా రెండు బ్లాక్‌లలో పార్క్ చేయడం, మిగిలిన మార్గంలో నడవడం వంటివి కూడా మీరు రోజూ మరింతగా కదలడానికి సహాయపడతాయి. మెట్లు ఎక్కడం ద్వారా గుండెతో పాటు కండరాలు, ఎముకలు, కీళ్ళు, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది., మెరుగైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఒత్తిడి, రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది.

ఒక్కచోటే కూర్చోవద్దు.. డెస్క్ వద్ద ఒక గంట కంటే ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి. లేచి చుట్టూ తిరగండి, ఆపై మళ్లీ కూర్చోండి. ఇది మీ కండరాలు బిగుసుపోకుండా చేస్తుంది.

చిన్న చిన్న వ్యాయామాలు.. మీ కుర్చీపై కూర్చున్నప్పుడు లేదా ఆఫీసులో రెండు నిమిషాల విరామం సమయంలో వివిధ చిన్న చిన్న వ్యాయామాలు చేయవచ్చు. చిన్నపాటి కార్యకలాపాలు మన జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. దీని ప్రభావం చాలా గంటలు ఉంటుంది.

స్వీట్స్ కు గుడ్ బై చెప్పండి.. చక్కెరతో కూడిన విందులు, తియ్యటి పానీయాలను అతిగా తినడం మానుకోవాలి. తప్పనిసరిగా ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోండి. మద్యం, ధూమపానం పూర్తిగా మానేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu