Banana for Skin Glow: అప్పటికప్పుడు మీ ముఖం మెరిసిపోవాలా.. అరటిపండుతో ఇలా చేయండి..

అరటి పండ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అరటి పండుతో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండానే.. ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అరటి పండుతో చర్మ, జుట్టు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మ సమస్యలను దూరం చేయడంలో అరటి పండు చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి. బనానాలో విటమిన్లు బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్..

Banana for Skin Glow: అప్పటికప్పుడు మీ ముఖం మెరిసిపోవాలా.. అరటిపండుతో ఇలా చేయండి..
Banana For Skin Glow
Follow us

|

Updated on: Oct 02, 2024 | 1:36 PM

అరటి పండ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అరటి పండుతో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండానే.. ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అరటి పండుతో చర్మ, జుట్టు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మ సమస్యలను దూరం చేయడంలో అరటి పండు చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి. బనానాలో విటమిన్లు బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి. అరటి పండు చర్మానికి యూజ్ చేయడం వల్ల మచ్చలు, ముడతలు, పింపుల్స్ వంటివి తగ్గుతాయి. ఇందులో ఉండే పోషకాలు.. చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్‌గా ఉంచుతాయి. చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా రక్షిస్తుంది. అరటి పండుతో వేసుకునే ఫేస్ ప్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు – తేనె:

ఒక గిన్నెలో అరటి పండు గుజ్జు, కొద్దిగా తేనె కలిపి.. చర్మంపై రాయడం వల్ల చర్మానికి సహజంగా మెరుపు వస్తుంది. చర్మానికి తేమ అనేది చాలా అవసరం. స్కిన్ హైడ్రేట్‌గా ఉంటే మెరుస్తూ ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్‌ని ఓ పావు గంట సేపు ఉంచి ఆ తర్వాత నీటితో కడిగేయాలి.

అరటి పండు – పెరుగు:

అరటి పండు, పెరుగు కాంబినేషన్ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు, మచ్చలు పోయి క్లియర్‌గా ఉంటుంది. చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా మెరుస్తూ ఉంటుంది. ఈ ప్యాక్ కూడా 10 – 15 నిమిషాలు ఉంచి కడిగేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అరటి పండు – నిమ్మరసం:

నిమ్మకాయ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయ పడుతుంది. అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం పిండి కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖం అంతా అప్లై చేసి.. ఓ 15 నిమిషాలు ఉంచాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

అరటి పండు – అవకాడో:

అరటి పండు, అవకాడో కూడా చర్మానికి ఎంతో మంచి పోషణను అందిస్తాయి. ఈ రెండింటిని గుజ్జుల చేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖం, మెడకు మొత్తం అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అనంతరం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్‌గా, సాఫ్ట్‌గా మెరిసేలా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక