Get Rid of Mosquitoes: దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు!
చలి కాలంలో కూడా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా చికెన్ గున్యా అనే వ్యాధి ఎక్కువగా ఎటాక్ చేస్తుంది.. ఇంట్లో కొన్ని రకాల పద్దతుల ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా చేసుకోవచ్చు..
ప్రస్తుత తరుణంలో దోమల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ సీజన్‌లో ఎక్కువగా దోమలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దోమల్ని నియంత్రించేందుకు చాలా మంది అగరు బత్తీలు, లిక్విడ్స్, క్రీమ్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా రావచ్చు. కానీ దోమలను ఎలా నియంత్రించాలో తెలీక చాలా మంది వీటినే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు అవసరం. దోమల్ని ఇలా రసాయనాలు కలిపిన వాటితోనే కాకుండా.. హోమ్ రెమిడీస్‌తో కూడా వదిలించుకోవచ్చు. వీటి వలన ఆరోగ్యానికి కూడా పెద్దగా నష్టం ఉండదు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
టీట్రీ ఆయిల్:
దోమల్ని అరికట్టడంలో ఈ టీట్రీ ఆయిల్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ ఆయిల్ శరీరంపై రాసుకుంటే దోమలు కుట్టవు. టీట్రీ ఆయిల్ నుంచి వచ్చే వాసన కారణంగా దోమలు దూరంగా ఉంటాయి. ఈ ఆయిల్‌లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. దీని వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. పిల్లలకు కూడా ఈ ఆయిల్‌ని ఎలాంటి డౌట్ లేకుండా రాయవచ్చు. ఈ ఆయిల్ రాసుకుంటే కరెంట్ లేకపోయినా, ఫ్యాన్ తిరగక పోయినా దోమలు కుడతాయనే ఇబ్బంది ఉండదు.
బిర్యానీ ఆకులు:
బిర్యానీ ఆకుల్ని ఉపయోగించడం వల్ల కూడా దోమలకు గుడ్ బై చెప్పొచ్చు. సాధారణంగా బిర్యానీ ఆకుల్ని పులావ్, బిర్యానీ తయారీలో ఉపయోగిస్తారు. కానీ ఈ ఆకులతో దోమలను కూడా తగ్గించుకోవచ్చు. బిర్యానీ ఆకులను వెలిగించి పొగ వచ్చేలా చేసి.. ఇంట్లో తలుపులు, కిటీకీలు అన్నీ మూసేయాలి. ఈ పొగ కారణంగా దోమలు ఉక్కిరి బిక్కిరి అయి చనిపోతాయి. ఓ గంట సేపు ఆగి తలుపులు తీసేస్తే సరిపోతుంది.
పుదీనా ఆయిల్:
పుదీనా ఆయిల్ వాడకం వల్ల కూడా దోమల సంఖ్యను తగ్గించుకోవచ్చు. పుదీనా ఆయిల్ ఒంటికి రాసుకోవడం వల్ల దోమలు ఎక్కువగా కుట్టవు. పిల్లలకు కూడా రాయవచ్చు. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు దోమలు దగ్గరకు రావు. రాత్రి, మధ్యాహ్నం కూడా పిల్లలకు రాయవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.