ప్రపంచంలో ఒక్క పొలం కూడా లేని దేశం ఎదో తెలుసా?

TV9 Telugu

15 November 2024

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కోసం 600 మిలియన్లకు పైగా క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో వ్యవసాయం కోసం 74% భూమి ఆసియా దేశాలలో ఉంది.

అయితే ఒక్క పొలం కూడా లేని దేశం ప్రపంచంలోనే ఉందని మీకు తెలుసా..? ఈ దేశంలో ఒక్క పొలం లేకపోయినా ఇక్కడి ప్రజలకు ఏమీ లోటు లేదు.

ప్రపంచంలో ఒక్క పొలం కూడా లేని దేశం మరేదో కాదు సింగపూర్. ఈ దేశన్నీ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చారు.

735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సింగపూర్ అతి చిన్న దేశాలలో ఒకటి. 1965లో మలేషియా నుండి విడిపోయి సింగపూర్ పుట్టింది. దీనిని సింహాల ద్వీపం అని కూడా అంటారు.

ఆసియాలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం సింగపూర్‌. ప్రపంచంలోని తొమ్మిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

ఇక్కడ ముడిసరు ఇతర దేశాల నుంచి సరఫరా అవుతుంది. ఇక్కడ ఆహారం, పండ్లు, కూరగాయలు ఇతర దేశాలపై ఆధారపడి ఉంటాయి.

సింగపూర్‌లోని నీరు మలేషియా నుండి, పాలు, పండ్లు, కూరగాయలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుండి దికుమతిలో వస్తుంది.

సింగపూర్ పప్పులు, బియ్యం, ఇతర అవసరాలను థాయ్‌లాండ్, ఇండోనేషియా తీరుస్తున్నాయి. వీరు కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తారు.