నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..
16 November 2024
Ravi Kiran
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మంచి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. అలాగే ఆహారం ఏమాత్రం తేడాలు వచ్చినా వెంటనే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంతమేర ప్రయోజం ఉంటుందనడంలో నిజం ఉన్నట్లు కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు. కానీ నెలరోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే..
నెలరోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్దరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి