Lifestyle: మంచి అలవాట్లే కానీ ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు..

ఆరోగ్యానికి మంచి చేసే కొన్ని అలవాట్లు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని మీకు తెలుసా.? అతి ఏదైనా అనర్థాలకు దారి తీస్తాయన్నట్లు, కొన్ని రకాల ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం లేదా తప్పుడు విధానంలో తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: మంచి అలవాట్లే కానీ ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు..
Lifestyle
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2024 | 10:00 AM

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లతో ఆరోగ్యం బాగుంటుందని తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మంచి అలవాట్లు కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా మాంసాహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయనే విషయం తెలిసిందే. అయితే జీర్ణ సంబంధిత సమ్యలతో బాధపడేవారు మాత్రం నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండాలి. అలాగే నాన్‌వెజ్‌లో ప్రోటీన్‌, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు నాన్‌వెజ్‌ను మితంగా తీసుకోవాలి. ఇలా ఆరోగ్యానికి మంచి చేసే నాన్‌ వెజ్‌ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.

* పండ్లు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో తెలిసిందే. అయితే పండ్లను డెజర్ట్‌ రూపంలో తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం పడేలా చేస్తుంది. అన్నం తిన్న వెంటనే పండ్లను తీసుకున్నా నెగిటివ్‌ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు వేధిస్తాయి.

* వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిలో వ్యాయామం చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగేందుకు కూడా ఇది దారి తీసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* మనిషికి ఎంతో ముఖ్యమైన మంచి నీరును మోతాదుకు మించి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువా నీరు తాగడం వల్ల కణజాలం వాపు, శరీరంలోని పలు భాగాల్లో వాపు సంభవించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువగా నీరు తీసుకోకూడదు.

* ఆరోగ్యానికి మంచి చేసే డ్రై ఫ్రూట్స్‌ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తీసుకుంటే.. మలబద్ధకం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అదే విధంగా అలెర్జీలు, మంట, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..