న్యూక్లియర్ అణు బాంబు దాడి అనేది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైనదిగా నేటికి భావిస్తున్నారు. తిరుగులేని ఆయుధంగా పరిగణించబడే ఆయుధం ఇది
TV9 Telugu
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా నగరంపై ప్రయోగించిన అణుబాంబు ప్రభావం నుంచి నేటికీ ఆ దేశం కోలుకోలేదు
TV9 Telugu
జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా బాంబు దాడి దుర్ఘటనకు 79 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్టు 6న హిరోషిమాపై, అదే నెల 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు.. సుమారు 2 లక్షల మందికిపైగా జపాన్ పౌరులను బలితీసుకున్నాయి
TV9 Telugu
పెరల్ హార్బర్‌పై దాడికి ప్రతీకారంగా అణు దాడులతో జపాన్‌కు అమెరికా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఆ మహావిషాదానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్‌ను వెంటాడుతూనే ఉన్నాయి
TV9 Telugu
అణుబాంబు ఎంతో ప్రమాదకరమైన ఆయుధం. ఏ నగరాన్ని అయినా పూర్తిగా నాశనం చేయగల సామర్ధ్యం దీనికి ఉంటుంది. అణుబాంబు పేలిన తర్వాత ఆ ప్రదేశంలో మనుషులు, జంతువులతోపాటు అసలేప్రాణీ బతకలేవు
TV9 Telugu
పొరపాటున ఈ ఆయుధాన్ని ఎక్కడైనా పడేసినా, అక్కడ ఏమీ మిగలదని అర్థం చేసుకోవచ్చు. ప్రతిదీ నాశనం అవుతుంది. అయితే న్యూక్లియర్ బ్లాస్ట్ అయితే అణుబాంబు ప్రభావం ఏమాత్రం పడని ఓ జీవి ఉందని మీకు తెలిస్తే షాక్ అవుతారు
TV9 Telugu
అవును.. ఇలాంటి చోట కూడా ఆ జీవి భేషుగ్గా బతికేస్తుంది. అదేదోకాదు బొద్దింక. దీన్ని తక్కువగా అంచనా వేసి చాలా మంది పాదాల కింద తొక్కేస్తారు. కానీ బొద్దింకలు తల లేకుండా 1 వారం జీవించగలవు
TV9 Telugu
అవి తమ శరీర భాగాలలో ప్రతి చిన్న రంధ్రాల ద్వారా కూడా ఊపిరి పీల్చుకుంటాయి. నీరు తాగకపోతే ఇతర జీవులు డీహైడ్రేషన్‌తో చనిపోతాయి. బొద్దింకలు ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలవు. ఇవి 280 మిలియన్ సంవత్సరాల క్రితం కార్బోనిఫెరస్ యుగంలో ఉద్భవించాయట