AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్ మీకోసం..! ఇంట్లోనే చేసుకోండిలా..!

చింతపండు వంటల్లో పుల్లని రుచిని అందించడమే కాదు, చర్మ సంరక్షణలోనూ గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది తెలియని చాలా మంది మహిళలు దీని ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. మొటిమలు, చర్మం మసకబారడం, మచ్చలు వంటి సమస్యలను తగ్గించడంలో చింతపండు అద్భుతమైన సహాయాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే ఈ చింతపండుతో తేలికగా ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Beauty Tips: మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్ మీకోసం..! ఇంట్లోనే చేసుకోండిలా..!
Tamarind Face Pack
Prashanthi V
|

Updated on: Mar 06, 2025 | 11:03 PM

Share

చింతపండును చిన్న ముక్క తీసుకొని పావుకప్పు గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత గుజ్జును వేరుచేసుకొని, అందులో ఒక చెంచా ముల్తానీ మట్టి, కొద్దిగా రోజా వాటర్ కలిపి మిశ్రమం తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల పాటు విడిచిపెట్టాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జులో అరచెంచా పసుపు కలిపి పేస్టును తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పసుపులోని యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని రక్షిస్తాయి. చింతపండు సహాయంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

చింతపండు గుజ్జును తీసుకొని అందులో అరటిపండు గుజ్జు, శెనగపిండిని కలిపి మృదువైన పేస్టును తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

ఒక చెంచా చింతపండు గుజ్జులో టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరచెంచా బేకింగ్ సోడా, చెంచా పంచదార కలిపి మంచి స్క్రబ్బింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై మృదువుగా రుద్ది 15 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జిడ్డు చర్మం కలవారికి ఇది అత్యుత్తమ స్క్రబ్బింగ్ ప్యాక్‌గా పనిచేస్తుంది.

రెండు చెంచాల చింతపండు గుజ్జును తీసుకొని అందులో రెండు చెంచాల టీ డికాషన్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దూదిలో ముంచి ముఖంపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేయడంతో పాటు గ్లో పెంచడానికి సహాయపడుతుంది.

చింతపండును వంటల్లో మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. దీని సహజమైన రసాయనాల వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం మెరుగు కోసం మార్కెట్‌లో లభించే కెమికల్ ప్రోడక్ట్స్‌కు బదులుగా చింతపండు లాంటి సహజ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేయండి. అలర్జీ, చర్మం ఎర్రబారడం కానీ కనిపిస్తే వెంటనే ఉపయోగాన్ని ఆపేయాలి. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!