దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. బెస్ట్ ఎంపికలు ఇవే

దీపావళి పండగ వస్తుందంటే చాలు మార్కెట్ లో సందడే సందడి. తమకు ఇష్టమైన వారితో పాటు.. స్నేహితులకు సన్నిహితులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుని దీపావళిని ప్రత్యేక పండుగగా జరుపుకుంటారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరికొకరు బహుమతులు అందజేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీ కుటుంబ సభ్యులకు బహుమతులు ఇవ్వడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వాలని ఆలోచిస్తున్నవారి సింపుల్ టిప్స్..

దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. బెస్ట్ ఎంపికలు ఇవే
Diwali Gift Ideas
Follow us

|

Updated on: Oct 21, 2024 | 7:13 PM

దీపావళి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను దీపాలు, రంగోలీలతో అలంకరించుకుంటారు. ఇంటి చుట్టూ లైట్లను వెలిగిస్తారు. ఈ రోజున రాముడు 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడని ఓ నమ్మకం. అంతేకాదు లోక కంటకుడైన నరకాసురుడు మరణించినందుకు సంతోషంగా ప్రజలు దీపాలు వెలిగించారని నమ్మకం.

దీపావళి పండగ సందర్భంగా ప్రజలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందజేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఇది సామాజిక, కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వీట్లు పంచుకుంటారు. పటాసులు కాల్చుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా దీపావళి రోజున ప్రత్యేక బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇవ్వాలనుకుంటే ఈ రోజు కొన్ని వస్తువులను గురించి తెలుసుకుందాం..

దీపాలు లేదా కొవ్వొత్తులు దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లను లైట్లు, దీపాలు, కొవ్వొత్తులతో ప్రకాశించేలా చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ బంధువులకు ప్రత్యేకమైన లైట్లు, దీపాలు, కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి ఇంటిని అలంకరించడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అందంగా డిజైన్ చేయబడిన దీపాలు లేదా సువాసనగల కొవ్వొత్తులు ఇంటి అలంకరణకు మరింత అందాన్ని జోడిస్తాయి.

ఇవి కూడా చదవండి

డ్రై ఫ్రూట్స్ స్వీట్లు కాకుండా మరేదైనా ఇవ్వాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఇలాంటి బహుమతులు ఇవ్వడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. అంతేకాదు చాలా కాలం వాటిని ఉపయోగించవచ్చు. అలాగే ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్‌కి అనేక రకాల ప్యాకేజింగ్‌లు ఉన్నాయి. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తాయి.

ఇండోర్ ప్లాంట్స్ దీపావళికి బంధువులకు, స్నేహితులకు పూల కుండలను కూడా ఇవ్వవచ్చు. ఈ ఎకో ఫ్రెండ్లీ బహుమతి దీపావళి రోజున ప్రత్యేకంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచుకోవడానికి ఇండో ప్లాంట్ ఇవ్వవచ్చు. లేదా పూల గుత్తిని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతులుగా కూడా ఇవ్వవచ్చు. ఇందులో డిజిటల్ వాచ్, మిక్సర్, టోస్టర్, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు సహా అలంకరణలో ఉపయోగించే వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు. దీపావళికి బహుమతిగా ఇవ్వడానికి దీపం కూడా ఉత్తమ ఎంపిక. మార్కెట్లో, ఆన్‌లైన్‌లో అనేక రకాల సైజ్ లలో దీపాలు లభిస్తున్నాయి.

వివిధ ఫుడ్ గిఫ్ట్ హ్యంపర్స్ స్పెషల్ స్నాక్స్, చాక్లెట్లు , డ్రై ఫ్రూట్స్‌తో కూడిన అందమైన ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో చాలా మంచి ఫుడ్ గిఫ్ట్ హ్యాంపర్‌లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతున్నాయి.

కిచెన్ వేర్ వంటగదిలో ఉపయోగించే వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. కిచెన్ సెట్ సహా ఇంట్లో ఉపయోగపడే అనేక ఇతర వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇండక్షన్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్, కడాయి , పాన్, గ్లాస్ లేదా కప్పులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

మరిని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!