Viral Video: పెళ్లి కోసం భారతీయ వరుడు కావాలి.. కండిషన్స్ అప్లై అంటోన్న రష్యన్ యువతి..
రష్యన్ అమ్మాయికి భారతీయ వరుడు కావాలట.. అయితే ఆ యువతి పెట్టిన కండిషన్స్ విన్న భారతీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు రష్యన్ అమ్మాయికి సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తనకు భాగస్వామిగా ఇండియన్ యువకుడు కావాలని.. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న భారతీయ అబ్బాయి కోసం వెతుకుతున్నట్లు ప్రజలకు చెబుతోంది. అయితే దీనితో పాటు ఆ అమ్మాయి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ భారతీయులకు షాక్ ఇచ్చాయి.
ఒక రష్యన్ అమ్మాయి భారతీయ సంస్కృతిని ఎంతగానో ఇష్టపడింది. దీంతో ఆ యువతి ఇప్పుడు తన కోసం భారతీయ అబ్బాయిని వెతుకుతోంది. నెల్లీ అనే ఈ రష్యన్ అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె భారతీయ వరుడి కోసం వెతుకుతున్నట్లు ప్రజలకు చెబుతోంది. అయితే ఇది విని భారతీయులు చలించిపోయారు. అయితే ఆ అమ్మాయి వీడియో పూర్తిగా చూసిన తర్వత ఇప్పుడప్పుడే ఏ అబ్బాయి దొరికడు అక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు.
నెల్లీ ఇన్‌స్టా ప్రొఫైల్ ప్రకారం ఆమె ఇప్పుడు దుబాయ్‌లో నివసిస్తున్నట్లు చూపిస్తుంది. అక్టోబర్ 18 న నేల్లీ ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు.. అయితే భారతీయ వరుడిని వెతుకుతున్నట్లు చెప్పింది. పెళ్లి కాని అబ్బాయిలు నెల్లీ వీడియోను చూసిన వెంటనే .. వారు దండలతో రెడీ అయ్యారు.. అయితే రష్యా అమ్మాయి షరతులు వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వైరల్ అవుతున్న వీడియోలో నెల్లీ భారతీయ సంప్రదాయాన్ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ రష్యన్ భామ తాను భారతీయ అబ్బాయి కోసం వెతుకుతున్నట్లు చెబుతోంది. అయితే తనకు కాబోయే భర్తకు కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్పింది. ఆ షరత్తులు ఏమిటంటే.. నెల్లి చెప్పిన ప్రకారం అబ్బాయి ఎత్తు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఉండాలి. అదే సమయంలో కళ్ళు ఆకుపచ్చగా ఉండాలి. సంగీత ప్రియులై ఉండాలి.. డ్యాన్స్ చేయడం కూడా బాగా తెలిసి ఉండాలి. అంతేకాదు ట్రావెలింగ్ జర్నీని ఎక్కువగా ఇష్టపడాలని పేర్కొంది.
భారతీయ వరుడి కోసం వెతుకుతున్న రష్యన్ అమ్మాయి వీడియో ఇక్కడ చూడండి.
View this post on Instagram
అంతేకాదు నెల్లీ మాట్లాడుతూ అతను తనను విపరీతంగా ప్రేమించడమే కాదు రష్యాను కూడా ప్రేమించాలని పేర్కొంది. ఈ వీడియోను అక్టోబర్ 18న తన ఇన్‌స్టా ఖాతా @girl_white_indianలో షేర్ చేసింది, ఇది ఇప్పటివరకు 2.5 లక్షల మందికి పైగా లైక్ లను సొంతం చేసుకుంది. అంతేకాదు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ఒకదారు వ్యాఖ్యానించారు హే సిస్టర్ భారతీయ అబ్బాయిగా బెన్10 కావాలని సూటిగా చెప్పు అని కామెంట్ చేశారు. అయితే మరొకరు ఆ యువతి పెట్టిన ప్రతి కండిషన్ బాగానే ఉంది.. ఒక్క ఆకుపచ్చ కళ్ళు మిస్ తప్ప.. నేను మిస్ అయ్యాను అని వ్యాఖ్యానించాడు. దీదీ తనను కలవకుండా తప్పించుకున్న హృతిక్‌ను కోరుకుంటుంది అని ఒకరు.. తాను ఆరు అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్నానని .. అయితే తాను నేను గ్రీన్ లెన్స్ ధరించవచ్చా అని ఫన్నీగా కామెంట్ చేశారు. నీకు భారత దేశం రేషన్, ఆధార్ , ఆయుష్మాన్ కార్డు కావాలని నేరుగా చెప్పొచ్చుగా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు మరొకరు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..