Pakistan: భారత్‌కు మరోసారి పాక్ అణుబాంబు బెదిరింపు.. భారత్‌లో ప్రతి మూలను నాశనం చేస్తాయని హెచ్చరిక
దాయాది దేశం పాకిస్తాన్ సైన్య అధికారి మరోసారి భారత్ ను బెదిరించారు. అది కూడా తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని.. గుర్తు చేసి మరీ హెచ్చరించారు. పాకిస్థాన్ అణుబాంబు నేషనల్ కమాండ్ అథారిటీ సలహాదారు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కిద్వాయ్ తమ దేశంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోగల అన్ని రకాల అణుబాంబులు ఉన్నాయని పేర్కొన్నారు. భారత దేశం జాగ్రత్తగా లంటూ హెచ్చరించారు.
ఆసియా దేశాలైన భారత దేశం, పాకిస్థాన్ దేశం అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. అందుకు విరుద్దంగా పాకిస్తాన్ సైన్యం. ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులు మాత్రం నిరంతరం అణ్వాయుధ బెదిరింపులను జారీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. పాకిస్థాన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కిద్వాయ్ మరోసారి భారత్‌ను అణ్వాయుధాలు ఉన్నాయని.. జాగ్రత్తగా ఉండాలంటూ బెదిరించారు. పాకిస్థాన్ వద్ద అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయని.. వాటితో భారత్‌ను ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చు అని అన్నారు. అయితే తాము అణ్వాయుధాలతో దాడులు చేస్తే భారతదేశం వద్ద S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూడా ఏమీ చేయలేదని హెచ్చరించారు. కిద్వాయ్ పదవీ విరమణ తర్వాత కూడా.. పాకిస్తాన్ సైన్యంతో అనుబంధం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ అణు బాంబులను పర్యవేక్షించే సంస్థ అయిన నేషనల్ కమాండ్ అథారిటీకి సలహాదారుగా ఉన్నారు. అణుబాంబు విషయంలో పాకిస్థాన్‌కు ‘నో ఫస్ట్ యూజ్’ విధానం లేదని కొద్ది రోజుల క్రితం కిద్వాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన ఇస్లామాబాద్ నాన్-ప్రొలిఫరేషన్ కాన్ఫరెన్స్ 2024లో కిద్వాయ్ మాట్లాడుతూ భారతదేశానికి ఈ హెచ్చరిక చేశారు. ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆర్మీ ఛైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ కిద్వాయ్ 1998 తర్వాత పాకిస్థాన్‌లో అణు నిర్వహణకు సంబంధించి తన ప్రసంగంలో పాకిస్థాన్ రహస్యంగా అణు కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఇది 1972లో ప్రారంభమైంది. అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయోజనం పొందేందుకు 1998లో ఈ విషయాన్నీ ప్రపంచానికి తెలియజేశారు. అంతేకాదు కాన్ఫరెన్స్ లో కిద్వాయ్ భారత అణుపరీక్ష గురించి కూడా ప్రస్తావించారు.
‘భారతదేశంలోని ప్రతి మూలలో దాడి చేయగల సామర్థ్యం’
1998లో మే నెలలో పాకిస్థాన్‌లో సమర్థవంతమైన న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏర్పడిందని లెఫ్టినెంట్ జనరల్ కిద్వాయ్ చెప్పారు. ఇది తమకు వ్యూహాత్మక నిరోధక సామర్థ్యానికి నమ్మకమైన స్థిరత్వాన్ని అందించిందని వెల్లడించారు. పాకిస్థాన్‌కు ఇప్పుడు పెద్ద ఎత్తున అణు నిరోధక సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది అణు దాడికి ముందు, అణుదాడి అనంతరాం తిరిగి దాడి చేయగల సామర్థ్యాన్ని పాకిస్తాన్‌కు అందించిందని చెప్పారు. ఈ అన్వాయుధాల వలన శత్రువుల దాడికి వ్యతిరేకంగా సమర్థవంతమైన ప్రతిఘటనను చేయగలమని చెప్పారు.
పాకిస్థాన్ సైనిక అధికారి పాకిస్థాన్ అణ్వాయుధ నిరోధక సామర్థ్యం గురించి కూడా బహిరంగంగా మాట్లాడారు. నిరోధక సామర్థ్యంలో వ్యూహాత్మక, కార్యాచరణ, వ్యూహాత్మక అణు బాంబులు మూడింటిని కలిగి ఉంటాయని కిద్వాయ్ చెప్పారు. భారతదేశంలోని ప్రతి మూలపై దాడి చేయగల సామర్థ్యం కూడా తమ వద్ద ఉన్న అణుబాంబుల్లో ఉన్నాయని హెచ్చరించారు. అదే సమయంలో భారతదేశంలో ఎక్కడా వ్యూహాత్మక ఆయుధాలను దాచే అవకాశం లేదని.. పాకిస్థాన్ వద్ద అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పారు. శత్రువుల భీకర ఎదురుదాడి వ్యూహం విఫలమయ్యేలా చేసే ఆయుధల సంఖ్య బాగానే ఉందని .. తమపై దాడి చేస్తే.. అందుకు ప్రతీకారం తీర్చుకుంటూ పాకిస్థాన్ చేసే భీకర ప్రతీకార దాడి భయంకరంగా ఉంటుందని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..