kashmir: గందర్బల్ ఉగ్రదాదిని ఖండించిన ఫరూక్ అబ్దుల్లా .. కశ్మీర్ ఎన్నటికీ పాకిస్థాన్‌గా మారదంటూ ప్రకటన

కాశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదు.. గౌరవప్రదంగా జీవించనివ్వండి.. అంటూ ఫారూక్ అబ్దుల్లా ఉగ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఫారూక్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది దుశ్చర్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదని.. ఇక్కడ గౌరవంగా జీవిద్దాం.. పురోగమిద్దాం అని కూడా ఆయన అన్నారు. ఇలాంటి దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

kashmir: గందర్బల్ ఉగ్రదాదిని ఖండించిన ఫరూక్ అబ్దుల్లా .. కశ్మీర్ ఎన్నటికీ పాకిస్థాన్‌గా మారదంటూ ప్రకటన
Ganderbal Attack
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2024 | 2:46 PM

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనను నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. కశ్మీర్ పాకిస్థాన్‌గా మారదని, గౌరవంగా జీవిద్దామని ప్రకటించారు. గత 75 సంవత్సరాలుగా ఉగ్రవాదం లేని పాకిస్తాన్ ఏర్పరచ లేదు ఇక ఈరోజు ఎలా ఉగ్రవాదం లేని దేశంగా ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ.. మేము గౌరవంగా బతుకుతూ విజయం సాధించాలనుకుంటున్నాము. అది ఉగ్రవాదం వలన జరగదని.. ఇక నైనా ఉగ్రవాదాన్ని ఆపెయ్యలని ఉగ్రవాదులకు సూచించారు.

ఉగ్రదాదులు అనేవి చాలా బాధాకరమైన విషయమని ఎన్‌సీ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చిన చాలా మంది పేద కూలీలు ఈ క్రూరత్వంతో అమరులయ్యారు. అమాయకతులతో పాటు వైద్యుడు కూడా మరణించాడని.. ఆ డాక్టర్ ప్రజలకు వైద్య సేవలను అందించాడు. ఉగ్రాదాడిలో ఇప్పుడు మరణించాడు. ఇలా మనుషుల ప్రాణాలు తీయడం వలన ఉగ్రవాదులకు ఏమి దొరుకుతుంది..? కశ్మీర్ ను మరో పాకిస్తాన్ గా మార్చాలనుకుంటున్నారా.. అలా ఎన్నడూ జరగదని చెప్పారు ఫరూక్ అబ్దుల్లా.

ఇవి కూడా చదవండి

‘కశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదు’

ఇలా దాడులు చేయడం వల్ల ఏమి లాభం పొందుతారని పాకిస్థాన్‌ను ఇక్కడే సృష్టించాలని భావిస్తున్నారా? అని అన్నారు. ఈ వ్యవహారానికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం, తద్వారా మేము ముందుకు సాగవచ్చు, తద్వారా మేము కష్టాల నుండి బయటపడవచ్చు. నిజంగా భారత్‌తో స్నేహం కావాలంటే ఇలాంటి ఉగ్రదాడులను ఆపండి అని పాకిస్థాన్ నేతలకు తాను చెప్పాలనుకుంటున్నానని అన్నారు ఫరూక్ అబ్దుల్లా.

కశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదని ఎన్‌సీ అధ్యక్షుడు అన్నారు. ఇలాంటి దాడులను ఆపవలసిన సమయం ఆసన్నమైంది. మిగిలిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాకిస్తాన్ తో చర్చలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.

ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటు

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లోని గగాంగీర్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. సొరంగంలో పనిచేస్తున్న కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఓ వైద్యుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ దాడులతో మరోసారి అందరూ అలర్ట్ అయ్యారు. లోయలో జరిగిన ఈ దాడిని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తీవ్రంగా ఖండించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..