What are Floods: ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?

What are Floods: ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?

Anil kumar poka

|

Updated on: Oct 21, 2024 | 1:18 PM

అతి తక్కువ సమయంలో అంటే కేవలం 6 గంటల వ్యవధిలో ఊహించని రీతిలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం వల్ల సంభవించే వరదల్ని ఫ్లాష్ ఫ్లడ్స్.. లేదా ఆకస్మిక వరదలు అంటారు. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ, పర్వతానువుల్లో, పట్టణాల్లో కుంభ వృష్టి కురిసినప్పుడు ఇవి సంభవిస్తుంటాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ప్లాష్ ఫ్లడ్స్ సర్వ సాధారణం. అలాగే మొన్నటి వయనాడ్ బీభత్సానికి , ఏపీలో విజయవాడలో జరిగిన విలయానికి కూడా ఫ్లాష్ ఫ్లడ్సే కారణం.

విజయవాడలో అయితే 4 నెలల్లో కురవాల్సిన వాన ఏకంగా 48 గంటల్లో కురిసింది. సాధారణంగా ఈ వానలు అంచనాలకు అందవు. కొద్ది నిమిషాల్లోనూ లేదంటే కొద్ది గంటల్లోనూ బీభత్సాన్ని సృష్టిస్తాయి ఈ ఆకస్మిక వరదలు. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ, పర్వతానువుల్లో కురిసినప్పుడు ఊహించని స్థాయిలో వరదలు ముంచెత్తుతాయి. సాధారణంగా వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు చాలా వరకు నేలలో ఇంకిపోతుంది. కానీ కంటిన్యూస్‌గా వర్షాలు కురుస్తూ.. ఆపై ఒకేసారి కుంభవృష్టి కురిస్తే… ఆ వర్షపు నీరు భూమిలో ఇంకే ఛాన్స్ ఉండదు. ఆ సమయంలో ఈ వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుంది. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ మాటల్లో చెప్పాలంటే సాధారణంగా పొడిగా ఉండే ప్రాంతాల్లో ఒక్కసారిగా కుంభవృష్టి కురవడం వల్ల నీటి స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఫలితంగా హఠాత్తుగా వరద ఆయా ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా విషయంలో అధికారులు చేసిన హెచ్చరికలకు కారణం ఇదే. ముఖ్యంగా తీర ప్రాంతాలైన కొత్తపట్నం, టంగుటూరు తదితర ప్రాంతాల్లో ఈ ముప్పు ఉండే అవకాశం ఉంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

1. వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
2. వీలైనంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు తమ తమ ఇళ్లను ఖాళీ చేసి ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం
3.రాత్రి వేళల్లో ఆకస్మిక వరదల్ని గుర్తించడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో వరదలొస్తే.. ఉదయం లేచేసరికి పరిస్థితి విషమిస్తుంది. కనుక అధికారుల సూచలను ఏ మాత్రం అలక్ష్యం చెయ్యకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
4.ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేసే సందర్భాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోకి కార్లలో ప్రయాణించొద్దు. చాలా సార్లు ఆకస్మిక వరదలు ఒకేసారి వాహనాలను ముంచేస్తాయి. కొన్ని సార్లు కొట్టుకుపోయే ప్రమాదాలు కూడా లేకపోలేదు. గతంలో ఎన్నోసార్లు మనం అలాంటి ప్రమాదాలను చూశాం.
5.ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసిన సందర్భాల్లో పిల్లల్ని, పెద్ద వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దు.
6.కచ్చితంగా మీ సెల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి. నాలుగైదు రోజులకు కావాల్సిన నిత్యావసరాలు ముందే తెచ్చి పెట్టుకోండి. అలాగే వాతావరణ శాఖ అందించే సూచనల్ని పాటించండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఇతర సహాయక సిబ్బందికి సహకరించండి. వాళ్లు చెప్పిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.