Watch: శ్రీశైలం సమీపంలో పులి సంచారం.. వీడియో చూడండి
నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీశాఖ అధికారులకు పులి కనిపించింది. నాగార్జున సాగర్ డ్యామ్ సమీపంలోని నాగులేటి రేంజ్ వద్ద రోడ్డుపై పులి సంచరిస్తూ కనిపించింది. దీనిని అటవీ శాఖ సిబ్బంది వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచరిస్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్ సమీపంలోని నాగులేటి రేంజ్ వద్ద రోడ్డుపై పులి కనిపించింది. దీనిని అటవీ శాఖ సిబ్బంది వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఈ పులికి ఐదేళ్ల వయస్సు ఉండొచ్చని వారు తెలిపారు. గత వారం అటవీ శాఖ సిబ్బంది ఎప్పటిలాగా గస్తీ నిర్వహిస్తుండగా.. రోడ్డు పక్కనే ఉన్న పోదల్లో నుంచి పులి బయటకు వచ్చింది. కాసేపు పులి అక్కడే ఉండి.. అనంతరం మళ్లీ చెట్ల పోదల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఓ చిన్న మగ పులి, రెండు ఆడ పులులు ఉన్నాయి.