AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అస్సలు వెనకడుగు వేయొద్దు.. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న గిర్ సింహం.. అమేజింగ్ వీడియో

మనం సింహాలను ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం.. లైవ్ లో దాదాపుగా చూసుండం.. అయితే.. సింహం పిల్లలతో కలిసి షికారు చేయడాన్ని కూడా చూసుండరు.. అలాంటి దృశ్యాలను  చూడకపోతే.. ఈ వీడియోను చూసేయండి.. అభయారణ్యంలో ఓ సింహం తన పిల్లలతో కలిసి వేటకు బయలుదేరినట్లుంది..

Viral Video: అస్సలు వెనకడుగు వేయొద్దు.. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న గిర్ సింహం.. అమేజింగ్ వీడియో
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2024 | 3:10 PM

Share

సింహాలను ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? దాదాపు చూసుండరు.. గంభీరంగా కనిపిస్తూ భయంకరంగా ఉంటాయి.. అందుకే.. సింహాలను అడవికి రారాజు అని అంటుంటారు.. అయితే.. సింహం పిల్లలకు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం.. కలిసి షికారు చేయడాన్ని ఎప్పుడైనా చూశారా..? అలాంటి దృశ్యాలను  చూడకపోతే.. ఈ వీడియోను చూసేయండి.. అభయారణ్యంలో ఓ సింహం తన పిల్లలతో కలిసి వేటకు బయలుదేరినట్లుంది.. వాటికి ఎలా ఉండాలో వేట పాఠాలు చెబుతూ.. బుజ్జి బుజ్జి సింహాలను వెంటబెట్టుకుని వాగులు వంకలు దాటుతోంది.. వాటిని చూస్తే చూడముచ్చటగా అనిపిస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

రెండు పిల్లలతో కలిసి ఆడ సింహం నీటి ప్రవాహం మధ్యలో నడుస్తోంది.. ఈ వీడియో గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ కు సంబంధించినది.. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి. దీనిని ససన్ గిర్ అని కూడా పిలుస్తారు. ఆసియాలో సింహాలకు అత్యంత ముఖ్యమైన సురక్షిత ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. సింహాలు.. సింహాల కుటుంబాలు షికారు చేయడం.. అవి వాటి పిల్లలతో కలిసి తిరగడం.. సరదాగా గడిపే దృశ్యాలు తరచుగా కనిపిస్తుంటాయి.. ఈ క్రమంలోనే.. ఓ లేడీ సింహం తన రెండు పిల్లలతో కలిసి నడుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వీడియో చూడండి..

వాస్తవానికి తల్లి తన సంతానానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందన్న దృశ్యాలను మనం ఎప్పుడూ చూస్తుంటాం.. వింటుంటాం.. అలాగే.. ఈ సింహం కూడా తన పిల్లలతో కలిసి నీటిని దాటుతూ.. వేట పాఠాలు బోధిస్తోంది.

దీనికి సంబంధిచిన వీడియోను ఎంపీ పరిమల్ నత్వానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.. గిర్ జలపాతం నుంచి దట్టమైన అటవీ ప్రాంతం వరకు.. సింహరాశి తన పిల్లలకు మార్గదర్శకంగా మారుతుంది.. అంటూ పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..