AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది తల్లా..! మృగమా.. భర్తని ఇబ్బంది పెట్టేందుకు 23 అంతస్తు అవుట్‌డోర్ ఎయిర్ కాన్ యూనిట్‌పై పిల్లల్ని కుర్చోబెట్టిన మహిళ..

మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా భార్యాభర్తలు మధ్య గొడవలు జరిగితే అందుకు బలి పశువులుగా పిల్లలు మారుతున్నారు. భర్తతో గొడవపడి 23వ అంతస్తు నుంచి పిల్లలను ఓ రేంజ్ లో భయబ్రాంతులకు గురి చేసింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. తన భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి, ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను 23వ అంతస్తు బయట ఉన్న ఏసీపై కూర్చోబెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

Viral Video: ఇది తల్లా..! మృగమా.. భర్తని ఇబ్బంది పెట్టేందుకు 23 అంతస్తు అవుట్‌డోర్ ఎయిర్ కాన్ యూనిట్‌పై పిల్లల్ని కుర్చోబెట్టిన మహిళ..
Viral News
Surya Kala
|

Updated on: Oct 21, 2024 | 7:59 PM

Share

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే కొన్నిసార్లు పిల్లలు కూడా దీని పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది. భర్తతో గొడవపడి ఓ మహిళ చేసిన పని షాకింగ్ గా మారింది. తన భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ మహిళ తన ఇద్దరు చిన్నారులను 23వ అంతస్తు నుండి పడెయ్యడానికి ప్రయత్నం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భయాందోళనలకు గురయ్యారు. మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లుయోయాంగ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు అపార్ట్‌మెంట్ వెలుపల ఉన్న ఏసీ యూనిట్‌ పై కుర్చుని  వేలాడుతుండడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. పిల్లల పక్కనే ఉన్న కిటికీలో కూర్చుని ఆ మహిళ భర్తను చూసి కేకలు వేస్తోందని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి పిల్లలను రక్షించడానికి కిటికీ వైపు రావడంతో.. తన భర్త రాకుండా ఆ మహిళ ఆపడం మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో పిల్లలు ఏసీ యూనిట్‌పై కూర్చోబెట్టి ఆ మహిళ కిటికీ వద్ద సమీపంలో కూర్చుని తన భర్తతో గొడవ పడుతోంది. వీడియోలో ఆ మహిళ నిరంతరం అరుస్తూ ఉండటం, ఆమె భర్త ప్రశాంతంగా ఉండటం, పిల్లలను లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అతను కిటికీ వైపు రాగానే.. ఆ మహిళ అతన్ని ఆపింది.

ఇక్కడ వీడియో చూడండి

అదృష్టవశాత్తూ ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను రక్షించారు. అయితే పిల్లల తల్లిపై చర్యలు తీసుకున్నారా లేదా అనేది తెలియరాలేదు. అయితే ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో ప్రజలు మహిళలను తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

‘ఇది తల్లా లేక మృగమా?’

ఒకరు తల్లిదండ్రులు గొడవ పడితే పిల్లలకు ఎందుకు శిక్ష.. అదే సమయంలో మరొకరు చెప్పారు అసలు తల్లి ఎలా ఈ పని చేయగలదు? ఇది అనాగరికతకు గుర్తు. అంతేకాదు ఈ మహిళ మానసిక సమతుల్యం కోల్పోయినట్లు తెలుస్తోందని మరొకరు కామెంట్ చేశారు. మరొకరు ఆమె తల్లా లేదా మృగమా? 23వ అంతస్తు నుంచి పిల్లలు పడిపోతే ఏమై ఉంటుందో కూడా ఆలోచించడానికి మనసు రావడం లేదు అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..