- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2024: theme ideas for creative home decoration this Deepavali festival in telugu
Diwali 2024: దీపావళికి ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా..! సింపుల్ టిప్స్ మీ కోసం
హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో ఒకటి దీపావళి. అమావాస్య చీకట్లను తొలగిస్తూ దీపాలను వెలిగించడమే కాదు.. పిల్లలు పెద్దలు ఇష్టంగా పటాకులు కాలుస్తూ సందడి చేస్తారు. అయితే దీపావళి రోజున ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని సింపుల్ ఐడియాస్ మీ కోసం. ఆ చిట్కాలను అనుసరించి ఇంటిని అలంకరించుకుంటే దీపావళి పండగకు మరింత వన్నెలు తెస్తాయి.
Updated on: Oct 21, 2024 | 6:08 PM

ఈ దీపావళికి ఇంటి ఆవరణలో అందమైన ముగ్గులు వేయండి. రంగురంగుల ముగ్గులు ఇంటి పండుగ శోభను మరింత పెంచుతుంది. దేవుడి పూజ గదిలో దేవుడి ముందు కూడా చిన్న రంగోలి వేయండి. సాంప్రదాయ, ఇంటి అలంకరణ, ముగ్గులకు ఎంచుకునే రంగులు పండగ స్ఫూర్తిని జోడించడానికి మంచి మార్గం. ముగ్గుల చుట్టూ దీపాలను వెలిగించడం వలన రంగోలి అలంకరణను మరింత అందంగా మార్చుకోవచ్చు.

ముగ్గులను అందంగా తీర్చిదిద్దదానికి పువ్వులను ఉపయోగించవచ్చు. అంతేకాదు రకరకాల కలర్స్ ను కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఇంటిని వివిధ రంగుల పూలతో, మామిడి తోరణాలతో అలంకరించండి.

ఇంటి ముందు లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. చీకట్లో వెలిగే రంగుల లైట్లు అందంగా కనిపిస్తాయి. అలాగే జనపనారతో బంతులను తయారు చేసి వాటి లోపల చిన్న బల్బును అమర్చి లైట్ గా తయారు చేసుకోవచ్చు. ఇవి దీపావళికి మరింత అందాన్ని జోడిస్తాయి. దీపావళి పండగకు కొత్తదనాన్ని తెస్తాయి. అందంగా కనిపించే లైటింగ్ మెరుపులతో మీ మోముపై చిరునవ్వును నింపుతాయి.

ఒక గిన్నెలో నీటిని నింపి ఆ నీటిలో పూల అందంగా అలంకరించండి. ఆపై పువ్వుల డిజైన్ లో దీపం పెట్టండి. ఈ డెకరేషన్ అందంగా కనిపిస్తుంది. ఇంటి హాలులో లేదా వరండాలో ఉంచడం ద్వారా ఇంటి అందాన్ని పెంచుతుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది.

ఇంటి ఆవరణలో చిన్న చెట్లు ఉంటె ఆ చెట్లకు లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మ చుట్టూ ఉండే లైట్లు.. ముఖ్యంగా రంగు రంగు లైటింగ్‌లు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా కొత్త రకాల ఆలోచనలు దీపావళి పండగ వాతావరణాని తీసుకుని వస్తాయి. ఇంటిలో ఉత్సాహాన్ని , అందాన్ని పెంచుతాయి.




