AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రో ట్రైన్‌లో మగ ప్రయాణికులను పిచ్చకొట్టుడుకొట్టిన ఆడ పోలీసులు! ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో

మెట్రో ట్రైన్లో మహిళా కోచ్ లోకి ఎక్కిన కొందరు మగ ప్రయాణిలకు మహిళా పోలీసులు చుక్కలు చూపించారు. దిగమని మర్యాదగా చెబితే ఒక్కరూ దిగలేదు.. దీంతో దొరికిన వారిని దొరికినట్లు చొక్కాబట్టుకుని లాక్కెళ్లి మరీ పిచ్చికొట్టుడు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో..

Viral Video: మెట్రో ట్రైన్‌లో మగ ప్రయాణికులను పిచ్చకొట్టుడుకొట్టిన ఆడ పోలీసులు! ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో
Delhi Metro Train
Srilakshmi C
|

Updated on: Oct 21, 2024 | 6:06 PM

Share

ఢిల్లీ, అక్టోబర్ 21: ఓ మెట్రో రైలులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొందరు పురుషులు మహిళల కోచ్‌లో ఎక్కి ఎంచక్కా ప్రయాణించసాగారు. గమనించిన మహిళా పోలీసులు సదరు పురుషులను చితక్కొట్టారు. ఈ సంఘటన ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో మహిళల కోసం రిజర్వ్ చేసిన కోచ్‌లోకి దాదాపు 40 మంది పురుషులు బలవంతంగా ప్రవేశించారు. వీరంతా మెట్రో ప్రయాణిస్తుండగా CISF అధికారులు గమనించారు. వారిని బయటకు రావాలని కోరగా.. వారు మాత్రం ఖాళీ చేయడానికి ససేమిరా అన్నారు. మరోవైపు మహిళా కోచ్‌లో పురుషులు ఎక్కడం ఏంటని మహిళా ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు సదరు కోచ్‌లోని పురుషులకు చుక్కలు చూపించారు. మర్యాదగా బయటికి రావాలని అడిగితే ఎవరూ రావడం లేదని.. ఒక్కొక్కరిని కాలర్‌ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. అనంతంరం దిరికిన వారిని దొరికినట్లు పిచ్చ కొట్టుడు కొట్టారు. నిజానికి ఈ సంఘటన నవంబర్ 2010లో మెట్రో లైన్ 2 జహంగీర్‌పురి నుంచి హుడా సిటీ సెంటర్‌కు వెళ్తున్న మెట్రో ట్రైన్‌లో చోటు చేసుకుంది. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పోలీసుల దురుసు ప్రవర్తనను ఎండగడుతూ కామెంట్లు పెడుతున్నారు. మగ ప్రయాణీకులపై పక్షపాతాన్ని చూపారంటూ కొందరు నెటిజన్లు మగ ప్రయాణికుల పట్ల పోలీసు సిబ్బంది ప్రవర్తనను విమర్శించారు. ‘మహిళలను వేధించడానికే పురుషులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అలాంటప్పుడు, మహిళలను పబ్లిక్/జనరల్ కోచ్‌లలోకి ఎందుకు అనుమతిస్తున్నారు? ప్రత్యేక కోచ్‌లు ఉన్నప్పటికీ వారికి అక్కడ కూడా రిజర్వ్‌డ్ సీట్లు ఎందుకు ఇస్తున్నారు? పురుషులకు ప్రత్యేకంగా కోచ్‌లు ఎందుకు లేవు? పబ్లిక్ కోచ్‌లు నిండితే పురుషులు మరెక్కడికి వెళ్లాలి? అంటూ ఓ యూజర్‌ మండిపడ్డాడు. ‘ఇటువంటి పోలీసు సిబ్బంది సిగ్గుపడాలి. మగవాళ్ళతో ఇలా ప్రవర్తిస్తే దేశం సిగ్గుపడాలి. ప్రత్యేక హక్కులు అడిగితే అన్నింటా సమానమని చెప్పుకునే మహిళలు సిగ్గుపడాలి’ అంటూ మరో యూజర్ కాస్తగట్టిగానే ఏసుకున్నాడు. ‘పోలీసు డిపార్ట్‌మెంట్ వారికి ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యమేనా? భారీ జరిమానాలు ఉన్నాయిగా అమలు చేయండి. అంతేగానీ చేయిజేసుకునే హక్కు ఎవరిచ్చారు? అరెస్టు చేస్తున్నప్పుడు పబ్లిక్‌ను తాకడానికి కూడా అధికారులకు హక్కు లేదు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వారసత్వంగా వస్తున్న వలసవాద హ్యాంగోవర్’ అని ఇంకో యూజర్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇంతకీ మీరేమంటారు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.