AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis Diet: కీళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఏం తినాలి..? ఎలాంటివి తినకూడదో తెలుసుకోండి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజిబిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. మారిన జీవన శైలితో వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వ్యాదులలో ఆర్థరైటిస్ ఒకటి. కీళ్ళలో వచ్చే ఒక వ్యాధి. కీళ్ల నొప్పులు, వాపు సమస్య సర్వసాధారణంగా మారింది. సాధారణంగా వందకుపైగా ఆర్థరైటిస్ ఉన్నాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అటువంటి సమయంలో తినే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకుని ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Arthritis Diet: కీళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఏం తినాలి..? ఎలాంటివి తినకూడదో తెలుసుకోండి..
Arthritis Diet
Surya Kala
|

Updated on: Aug 02, 2025 | 4:53 PM

Share

నేటి బిజీ జీవితంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది తరచుగా కీళ్ల నొప్పులు, వాపులు లేదా దృఢత్వం వంటి సమస్యల గురించి ఫిర్యాదు చేస్తారు. ఈ సమస్యలు ఎక్కువ కాలం పాటు కొనసాగితే.. వాటిని విస్మరించడం సరైనది కాదు. ఈ సమస్యలు ఆర్థరైటిస్ కి సంకేతం కావచ్చు. ఇది సాధారణమైన..అయితే బాధాకరమైన సమస్య. ఇది వయస్సుతో పాటు మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. చాలా సార్లు మందులు తీసుకున్న తర్వాత కూడా కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం లభించదు. అటువంటి పరిస్థితిలో తినే ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వాస్తవానికి తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే సమయంలో.. కొన్ని ఆహారపదార్ధాలకు దూరంగా ఉండడం కూడా తప్పనిసరి. ఎవరైనా ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే ఆర్థరైటిస్ రోగులు ఏమి తినాలో.. ఏమి తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

ఆర్థరైటిస్ రోగులు వేటిని తినాలంటే

ఆర్థరైటిస్ రోగులు ఖచ్చితంగా వారి ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవాలి . ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆర్థరైటిస్ విషయంలో శరీరంలో యూరిక్ యాసిడ్‌ను నిర్వహించడంలో అవిసె గింజలు ప్రయోజనకరంగా ఉంటాయి. రోజూ ఒక చెంచా అవిసె గింజలను తినాలి

ఇవి కూడా చదవండి

ఆర్థరైటిస్ రోగులు ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం ద్వారా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక అల్లం తినే ఆహారంలో భాగంగా కూడా చేసుకోవాలి

బ్లాక్ బెర్రీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఆర్థరైటిస్ రోగులకు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజ, బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఆర్థరైటిస్ వాపును తగ్గించడంలో వాల్‌నట్స్ సహాయపడతాయి.

ఆర్థరైటిస్ రోగులు ఏమి తినకూడదంటే

ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాహారం

సోడా, క్యాండీ, ఐస్ క్రీం, తెల్ల రొట్టె, శుద్ధి చేసిన పిండి(మైదా), పాల ఉత్పత్తులు, ఎక్కువ ఉప్పు , టమాటో వంటి ఆహారపదార్థాలకు ఆర్థరైటిస్ రోగులు వీలైనంత దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)