AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: మద్యం మత్తులో పాముతో రోడ్డుపై హంగామా.. పోలీసు సిబ్బందిపై పామును విసిరిన పాములవాడు..

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో తాగిన మత్తులో ఉన్న పాములను పట్టే వ్యక్తి.. పాముల పెట్టె నుంచి ఒక పామును బయటకు తీసి వీధిలో నానా హంగామా సృష్టించాడు. ఆ పాములవాడు దుకాణదారుల నుంచి డబ్బు డిమాండ్ చేశాడు.. మద్యం మత్తులో ఉన్న అతని డిమాండ్ ని దుకాణదారులు లెక్కచేయలేదు. దీంతో ఆ పాములవాడు పామును చూపించి అందరినీ భయపెట్టాడు. అదే సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను కూడా పాముతో వారిని భయపెట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Uttar Pradesh: మద్యం మత్తులో పాముతో రోడ్డుపై హంగామా.. పోలీసు సిబ్బందిపై పామును విసిరిన పాములవాడు..
Drunken Man
Surya Kala
|

Updated on: Aug 02, 2025 | 3:58 PM

Share

కాన్పూర్‌లో కళ్యాణ్‌పూర్ లోని ఒక వీధిలో తాగిన మత్తులో ఉన్న ఒక పాములవాడు సంచలనం సృష్టించాడు. శ్రావణ మాసంలో పాములకు పూజ అంటూ పాముని భక్తులకు చూపించే నెపంతో షాప్స్ దగ్గరకు వెళ్లి డబ్బు అడుగుతున్నాడు. మొదట్లో దుకాణదారులు అతన్ని పట్టించుకోలేదు. అయితే అతను పదే పదే డబ్బు డిమాండ్ చేసి వారిని వేధించడం ప్రారంభించాడు. దీంతో కొంతమంది దుకాణదారులు అతడిని తమ దుకాణం ముందు నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న ఆ పాములను పట్టుకునే వ్యక్తికి కోపం వచ్చింది. తన దగ్గర ఉన్న పాముల బుట్ట నుంచి పామును బయటకు తీశాడు.

పాముని బయటకి తీసిన వంటనే మార్కెట్ అంతా గందరగోళం నెలకొంది. పాములవాడు మొదట బయటకు తీసి పాముతో దుకాణదారులను భయపెట్టడానికి ప్రయత్నించాడు. ప్రజలు భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. సమీపంలోని కస్టమర్లలో కూడా తొక్కిసలాట జరిగింది. ఇంతలో అక్కడ సమీపంలో ఉన్న పోలీసులు కూడా పరిస్థితిని నియంత్రించడానికి వచ్చారు. అయితే మద్యం మత్తులో ఉన్న పాముల వాడు పామును చూపించి పోలీసులను భయపెట్టడానికి ప్రయత్నించాడు.

ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం ప్రకారం.. పాములవాడు పదే పదే పామును చూపిస్తూ.. ఎవరైనా తనను ఇబ్బంది పెడితే పామును వదిలేస్తానని బెదిరించాడు. మార్కెట్‌లో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది దుకాణదారులు తమ దుకాణాలను మూసివేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నాటకం దాదాపు అరగంట పాటు కొనసాగింది. పోలీసులు, స్థానిక ప్రజలు అతనితో పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎవరి మాటలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అక్కడ ఉన్నవారికి సహనం నశించి చివరికి దుకాణదారులు కోపంతో అంతా ఏకమై అతనిని చుట్టుముట్టడానికి సిద్ధమై పాముల వాడి వైపుకు వెళ్ళినప్పుడు.. పాములవాడికి భయం వేసింది. అందరూ కలిసి తనని కొట్టేస్తారు అని భావించి పరిస్థితి మరింత దిగజారడం చూసి.. వెంటనే పామును పాముల పెట్టెలో వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అక్కడ ఉన్న కొంతమంది ఈ సంఘటన మొత్తం దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పాములు పట్టే వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన స్థానిక ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు దీనిని ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రత్యేకమైన గొడవ అని పిలుస్తున్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..