AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sago Adulteration: కల్తీ సగ్గుబియ్యం తినే అనేక ఆరోగ్య సమస్యలు.. కల్తీ సగ్గుబియ్యాన్ని ఎలా గుర్తించాలంటే

ప్రసుత్తం మనిషి జీవితం డబ్బుల మీద నడుస్తోంది. కష్టపడకుండా డబ్బులు సంపాదించడం కోసం ఎంతటి దారుణానికి అయినా పాల్పడుతున్నాడు. ముఖ్యంగా తినే ఆహార పదార్ధాలను కల్తీ చేసి డబ్బులను సంపాదించే అక్రమార్కులకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. బియ్యం, కారం,నూనె, నెయ్యి, పప్పులు, పాలు ఇలా అనేక రకాల వస్తువులు కల్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మార్కెట్ లో కల్తీ సగ్గుబియ్యం లభిస్తున్నాయని.. వీటిని తినడం వలన ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకనే కల్తీ సగ్గుబియాన్ని ఎలా గుర్తించాలో కూడా కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవి ఏమిటంటే..

Sago Adulteration: కల్తీ సగ్గుబియ్యం తినే అనేక ఆరోగ్య సమస్యలు.. కల్తీ సగ్గుబియ్యాన్ని ఎలా గుర్తించాలంటే
Sabudana Fake Or Real
Surya Kala
|

Updated on: Aug 02, 2025 | 4:46 PM

Share

సగ్గుబియ్యాన్ని కేవలం ఉపవాసం సమయంలో తినే ఆహారం మాత్రమే కాదు. చాలా మంది తినే ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటిగా మారింది. సగ్గుబియ్యం కిచిడి, ఖీర్ లేదా పకోడీలు కడుపు నింపడమే కాకుండా తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. కానీ మార్కెట్లో లభించే అన్ని స్వచ్ఛమైనవి కావు. కొంతమంది దుకాణదారులు ఎక్కువ లాభం సగ్గుబియాన్ని పాలిష్, రసాయనాలతో తయారు చేస్తున్నారు. తినడానికి ఈ సగ్గుబియ్యం రుచికరంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితి నిజమైన, కల్తీ సగ్గుబియ్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ముఖ్యం. కనుక ఈ రోజు కల్తీ సగ్గుబియ్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

సగ్గుబియ్యాన్ని కర్ర పెండ్ల అనే మొక్క వేరు (కాసావా) నుంచి తయారు చేస్తారు. ఈ మొక్క దుంపల నుంచి ఉండే పిండి పదార్థం నుంచి సగ్గు బియ్యం తయారు చేస్తారు.మ అయితే వీటిని కొంతమంది సగ్గుబియ్యం తక్కువ ధరకే తయారు చేసేందుకు రసాయనాలు, సింథటిక్ స్టార్చ్ , బంగాళాదుంప, శుద్ధి చేసిన బియ్యం పిండిని జోడించి తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు సగ్గుబియ్యం మెరిసేలా చేసేందుకు బ్లీచింగ్ పౌడర్ ని కూడా ఉపయోగిస్తున్నారు.

కల్తీ సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

ఇవి కూడా చదవండి

కల్తీ సగ్గుబియ్యంతో చేసిన ఆహారపదార్ధాలను తినడం వలన వాటిలో ఉండే రసాయనాలు కడుపులో గ్యాస్, అజీర్ణం, వాంతులు-విరేచనాలు, కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లలు, వృద్ధులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది.

ఇంట్లో కల్తీ సగ్గుబియ్యాన్ని, నిజమైన సగ్గుబియ్యాన్ని ఎలా గుర్తించాలంటే

ప్రస్తుతం కల్తీ సగ్గుబియ్యం ఎక్కువగా దొరికుంటుంది. వీటిల్లో సోడియం హైపోక్లోరైట్, కాల్షియం హైపోక్లోరైట్, బ్లీచ్, ఫాస్పోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం వంటి హానికరమైన రసాయనాలు కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. కనుక ఇంట్లో కొన్ని సాధారణ పరీక్షల ద్వారా నిజమైన, కల్తీ సగ్గుబియ్యాన్ని గుర్తించవచ్చు. సజమైన సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మృదువుగా.. కొద్దిగా పారదర్శకంగా మారుతుంది. అయితే కల్తీ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కూడా లోపలి నుంచి గట్టిగా ఉంటుంది. చాలా జిగటగా ఉంటుంది.

సగ్గుబియ్యాన్ని నమలండి. నమలేటప్పుడు గంధపు రుచి వస్తే కల్తీ అని అర్థం. స్వచ్ఛమైన సగ్గుబియ్యం తింటే పిండి పదార్ధం దంతాలకు అంటుకుంటాయి. ఇవే స్వచ్ఛమైన సగ్గుబియ్యం

సగ్గుబియ్యం ప్యాకెట్ పారదర్శకంగా ఉంటే (లోపలి భాగం కనిపించేలా) ఉండడం మంచిది. సహజమైన సగ్గుబియ్యం తెల్లగా, శుభ్రంగా, ఒకే పరిమాణంలో ఉండాలి. విరిగిన, చాలా చిన్నవిగా లేదా పెద్దగా ఉన్న లేదా నల్ల మచ్చలు ఉన్న సగ్గుబియ్యం కొనవద్దు. సగ్గుబియ్యం వింతైన, పుల్లని లేదా పాతబడిన వాసన వస్తే కొనుగోలు చేయవద్దు.

ఎలా నిల్వ చేసుకోవాలంటే సగ్గుబియ్యం గాలి చొరబడని కంటైనర్‌లో పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. అప్పుడు నెలల తరబడి చెడిపోదు. ముఖ్యంగా వర్షాకాలంలో, తేమ, కీటకాల నుంచి రక్షణ కోసం వేప ఆకులు లేదా బే ఆకులను కంటైనర్‌లో వేసి ఉంచాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..