AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ చాట్ దాచాలనుకుంటున్నారా? ఇలా చేయండి..

వాట్సాప్‎.. ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్‎ఫోన్‎లో కనిపించే చాటింగ్ ప్లాట్‏ఫామ్. వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన పనులు వరకు అన్నింటిలో వాట్సాప్ వాడకం సర్వసాధారణం అయిపొయింది. ఇలాంటి పరిస్థితిలో చాలామంది కొన్ని ముఖ్యమైన లేదా వ్యక్తిగత చాట్‌లు ఎవ్వరికి కనిపించకూడదని అనుకొంటారు. అలాంటి వారు ఎంచుకున్న చాట్‌లను ఎవ్వరికి కనిపించకుండా హైడ్ చేయవచ్చు. అది ఎలానో ఈరోజు మనం తెలుసుకుందామా మరి..

Prudvi Battula
|

Updated on: Aug 02, 2025 | 3:39 PM

Share
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‎ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. బంధు మిత్రులు, ఆఫీస్ సిబ్బందితో పాటు తెలిసిన వారితో నిత్యం ఆయా అవసరాల కోసం మెసేజ్ చేస్తూ ఉంటారు. కొన్ని అత్యంత ముఖ్యమైన చాటింగ్స్ ఉంటాయి. వాటిని ఎవరికీ కనిపించకుండా దాచుకోవాలి అనుకుంటారు.

1 / 5
మీరు దాచాలనుకుంటున్న చాట్‌ను తెరవకుండానే ఎక్కువసేపు నొక్కండి. ఎక్కువసేపు నొక్కిన తర్వాత, మూడు చుక్కలపై క్లిక్ చేయండి. మీకు లాక్ చాట్ ఎంపిక కనిపిస్తుంది. చాట్‌ను లాక్ చేసిన తర్వాత, చాట్ జాబితా ఎగువన లాక్డ్ చాట్ అనే ఫోల్డర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫోల్డర్ జాబితా నుండి కనిపించకుండా పోవాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు.

2 / 5
ఫోల్డర్‌ను దాచడానికి, ముందుగా మీరు లాక్ చేసిన చాట్ ఫోల్డర్‌ను తెరవాలి. ఫోల్డర్‌ను తెరిచిన తర్వాత, కుడి వైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చెయ్యండి. సెట్టింగ్‌లలోని హైడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఎంపికపై క్లిక్ చేసిన వెంటనే, మీ ఫోల్డర్ చాట్ జాబితా నుండి ఎవ్వరికి కనిపించకుండా అదృశ్యమవుతుంది. మీకు నచ్చినప్పుడు ఆ చాట్‎ను చూసుకోవచ్చు.

3 / 5
అందుకు ముందుగా హైడ్ కింద ఉన్న సీక్రెట్ కోడ్‌ను ఉపయోగించండి. ఈ ఫోల్డర్ కోసం సీక్రెట్ కోడ్‌ను సృష్టించాలని నిర్ధారించుకోండి. ఎందుకంటే మీరు ఈ కోడ్ సహాయంతో మాత్రమే ఫోల్డర్‌ను సెర్చ్ చేయగలరు. లేదంటే దీన్ని మీరు చదలేరు. మీరు ఎంచుకున్న చాట్ బాగా రహస్యం అయింది అయితే మాత్రం కచ్చితంగా సీక్రెట్ కోడ్ పెట్టుకోండి.

4 / 5
మీరు ఎప్పుడైనా హైడ్ చేసిన చాట్‎ను అందరికి కనిపించేలా చేయన్నుకుంటే.. ముందుగా హైడ్ చేసిన చాట్స్‎లోకి వెళ్ళండి. అందులో మీకు నచ్చిన చాట్‎ను ఎంచుకొని దానిపై లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఉన్న మూడు డాట్స్‎పై క్లిక్ చెయ్యండి. ఇందులో అన్‎హైడ్ చాట్ అనే ఆప్షన్‎పై క్లిక్ చేయండి. అంతే ఆ చాట్ యధావిధిగా అందరికి కనిపిస్తుంది.

5 / 5