Health Tips: కందగడ్డను లైట్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..
కందగడ్డ గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. అందుకే దీనిని లైట్ తీసుకుంటారు. కానీ దీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇది జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.
Updated on: Aug 02, 2025 | 4:51 PM

గుండె జబ్బుల నుండి రక్షణ : కందగడ్డలో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

మెదడుకు: కందగడ్డ తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులో న్యూరాన్ల అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. తరుచూ ఆహారంలో దీనిని చేర్చుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతంది.

బరువు తగ్గడానికి: కంద గడ్డలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అధిక పీచు పదార్థాల కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

క్యాన్సర్ నుండి రక్షణ: కందగడ్డలోని యాంటీఆక్సిడెంట్లు ఇతర సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ వృద్ధిని ఇది ప్రభావవంతంగా అడ్డుకుంటుంది.

జీర్ణక్రియ సమస్యలకు చెక్: కందగడ్డలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.




