AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం కాదులే అనుకుంటే డైరెక్టుగా షెడ్డుకే.. లీటర్ కంటే నీరు తక్కువ తాగితే శరీరంలో జరిగేదిదే

మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీర భాగాలకు వెళ్లాలన్నా, మన రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయాలన్నా.. నీరు ఎంతో ముఖ్యం.. కానీ మన శరీరానికి ఇంత ముఖ్యమైన నీటిని మనం నెగ్లేట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా నీరు తాగకుండా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారు. ఒక రోజులో శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోతే ఏం జరుగుతుంది.. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏం కాదులే అనుకుంటే డైరెక్టుగా షెడ్డుకే.. లీటర్ కంటే నీరు తక్కువ తాగితే శరీరంలో జరిగేదిదే
Ai Image
Anand T
|

Updated on: Nov 14, 2025 | 9:42 AM

Share

మనం బ్రతకాలంటే గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నీరు తాగడాన్ని నెగ్లేట్ చేస్తున్నారు. రోజుకూ కనీసం లీటర్‌ నీటిని కూడా తాగట్లేదు. దీని కారణంగా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆరోగ్య నిపుణులు తరచుగా హైడ్రేటెడ్ గా ఉండాలని సిఫార్సు చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు త్రాగటం చాలా అవసరమని నిపుణలు చెబుతున్నారు. లేకుంటే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

తగినన్ని నీరు తాగకపోతే ఏం జరుగుతుంది

మూత్రపిండాల వ్యాధులు: మనం మన శరీరానికి వసరమైనంత నీరు తాగకపోతే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లకుండా మూత్రపిండాలు సరిగా పనిచేయవు.

రక్తపోటులో హెచ్చుతగ్గులు: నీరు సరిగ్గా తగ్గకపోవడంతో రక్తపోటులో అస్థిరతలు ఏర్పడతాయి. కడుపు నొప్పి, తల నొప్పి వంటి వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది

హైపోనాట్రేమియా: రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోవడం వల్ల వికారం, వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.

మెదడు పనితీరు తగ్గడం: మెదడు కుంచించుకుపోవచ్చు, దీనివల్ల ఏకాగ్రత తగ్గి, ప్రాథమిక పనులు కూడా చేయలేకపోవచ్చు. అలాగే మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల చిరాకు పెరుగుతుంది

శక్తి స్థాయిలు తగ్గడం: నీరు సరిగ్గా తగ్గకపోవడంతో శరీరానికి అవసరమైన శక్తి తగ్గి, నీరసంగా అనిపిస్తుంది.

కీళ్ల నొప్పులు: మీరు సరైన మొత్తంలో నీరు త్రాగకపోతే, మీరు కీళ్ల నొప్పులను మాత్రమే కాకుండా కండరాల నొప్పులు కూడా రావచ్చు.

రోజు ఎంత నీరు త్రాగాలి?

మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. 3 లీటర్ల నీరు అంటే దాదాపు 12 గ్లాసులకు సమానం. పొలంలో పనిచేసే వ్యక్తులు ఇంకా ఎక్కువగా తాగవచ్చు. పేగు ఆరోగ్యం నుండి బరువు తగ్గడం వరకు, శక్తిని అందించడం నుండి మూత్రపిండాలు, కాలేయాన్ని శేద్ది చేయడం వరకు, త్రాగునీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్దారించడం లేదు. వాటిని స్వీకరించే ముందు ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.