AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? ఎవ్వరికీ తెలియని అసలు రహస్యం ఇదే..

కొబ్బరి నీళ్లు కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు.. అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం శక్తివంతంగా, తాజాగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? ఎవ్వరికీ తెలియని అసలు రహస్యం ఇదే..
Coconut Water
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2026 | 4:07 PM

Share

కొబ్బరి నీళ్లు సహజంగా లభించే ఒక శ్రేష్టమైన పానీయం. వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొబ్బరి నీళ్లతో పాటు లేత కొబ్బరిని కూడా తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయంటున్నారు.. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఈ పానీయం ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తుందని.. అందుకే.. ప్రతి ఒక్కరూ కొబ్బరి నీటిని తాగవచ్చని సూచిస్తున్నారు. అయితే.. కొబ్బరి నీళ్లు తాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో (ఉదయం పూట) తాగడం.. ఇలా నిత్యం తాగడం వల్ల.. ఇది శరీరంలోని మలినాలను తొలగించి, రోజంతా ఎనర్జీని ఇస్తుంది. అయితే, మధ్యాహ్నం, వ్యాయామం తర్వాత లేదా దాహం వేసినప్పుడు కూడా తీసుకోవచ్చ.. ఇది శరీరానికి ఎలక్ట్రోలైట్స్.. తక్షణ శక్తిని అందిస్తుందని పేర్కొంటున్నారు..

కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తి పెరుగుదల: కొబ్బరి నీళ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది.
  2. క్యాన్సర్ ప్రమాదం తగ్గింపు: అధ్యయనాల ప్రకారం, కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
  3. చర్మ ఆరోగ్యం మెరుగుదల: యాంటీ ఆక్సిడెంట్లు సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించి, చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
  4. జీర్ణక్రియ సహాయం: కొబ్బరి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలున్నప్పుడు ఆయుర్వేద వైద్య సలహా తీసుకోవడం మంచిది.
  5. బరువు తగ్గడంలో తోడ్పాటు: కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ ఉంటాయి. ఇది కడుపు నిండిన భావన కలిగించి, ఆహారం తక్కువగా తినడానికి దోహదపడుతుంది. ఉదయం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
  6. రక్తంలో చక్కెర నియంత్రణ: ఇందులో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  7. గుండె ఆరోగ్యం: కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  8. జుట్టు ఆరోగ్యం మెరుగుదల: కొబ్బరి నీళ్లు జుట్టును హైడ్రేటెడ్‌గా ఉంచి, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  9. కండరాల ఆరోగ్యం: ఎలక్ట్రోలైట్లు కండరాల రికవరీకి సహాయపడతాయి. వ్యాయామం తర్వాత అలసిన కండరాలకు శక్తినిచ్చి, తాజాగా ఉంచుతాయి.
  10. రక్తపోటు నియంత్రణ: కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి, దానిని నియంత్రణలో ఉంచుతుంది.
  11. శరీర హైడ్రేషన్: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వేసవిలో శరీరానికి హాని చేసే కూల్ డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరి నీళ్లను ఎంచుకోవడం ఉత్తమం.
  12. ఎలక్ట్రోలైట్ సమతుల్యత: కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను సరిదిద్ది, కండరాలకు, శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వృద్ధులలో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది.. అలాంటి వారికి కొబ్బరి నీళ్లు అమృతంలా పనిచేస్తాయి.

ఈ ప్రయోజనాలను పొందడానికి కొబ్బరి నీళ్లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us