AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweets Crave: భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది? మీకూ ఈ అలవాటు ఉందా..

కొందరు ఏ టైంలో అయినా స్వీట్లు తినేందుకు అస్సలు ఆలోచించరు. నిజానికి.. ఒత్తిడిని తగ్గించడం, ఆనందాన్ని పంచుకోవడం వంటి వివిధ కారణాల వల్ల వారు స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమందికి భోజనం, స్నాక్స్ తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. దీన్ని స్వీట్ క్రేవింగ్స్ అంటారు. ఇది కొన్ని కుటుంబాల్లో..

Sweets Crave: భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది? మీకూ ఈ అలవాటు ఉందా..
Why You Always Crave Dessert After Dinner
Srilakshmi C
|

Updated on: Apr 03, 2026 | 2:11 PM

Share

సాధారణంగానే కొంతమందికి స్వీట్లు తినడం మహా ఇష్టం. ఏ టైంలో అయినా స్వీట్లు తినేందుకు అస్సలు ఆలోచించరు. నిజానికి.. ఒత్తిడిని తగ్గించడం, ఆనందాన్ని పంచుకోవడం వంటి వివిధ కారణాల వల్ల వారు స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమందికి భోజనం, స్నాక్స్ తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. దీన్ని స్వీట్ క్రేవింగ్స్ అంటారు. ఇది కొన్ని కుటుంబాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ భోజనం తర్వాత స్వీట్లు ఎందుకు తినాలని అనిపిస్తుందో? మీరు ఎప్పుడైనా ఆలోచించారా… దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ దానిని నియంత్రించే మార్గాలపై దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

భోజనం తర్వాత స్వీట్లు తినాలనే కోరిక ఎందుకు వస్తుంది?

కొంతమందికి స్వీట్లు తినాలని బలమైన కోరిక ఉంటుంది. మరికొందరు ఆరోగ్య సమస్యల కారణంగా స్వీట్లు తినాలనే కోరికను కలిగి ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కూడా దీనికి ప్రధాన కారణం. అలాగే ఆహారంలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అప్పుడు శరీరం శక్తి కోసం ఎక్కువ చక్కెరను కోరుకుంటుంది. ఫలితంగా స్వీట్లు తినాలనే కోరిక ఏర్పడుతుంది. అంతే కాదు స్వీట్లు తినాలనే కోరికకు ప్రధాన కారణాలలో ఒకటి పోషకాహార లోపం. శరీరంలో పోషకాలు లేనప్పుడు స్వీట్లు తినాలనే కోరిక పెరుగుతుంది.

కొంతమందికి తరచుగా దాహం వేస్తుంది. దానిని ఆకలిగా తప్పుగా భావిస్తారు. ఈ నిర్జలీకరణం శరీరానికి తీపి పదార్థాల కోరికను కూడా కలిగిస్తుంది. కొన్నిసార్లు శరీరం అలసిపోయినప్పుడు కూడా శరీరం తనకు అవసరమైన శక్తిని పొందడానికి లేదా అలసట నుంచి ఉపశమనం పొందడానికి తీపి ఆహారాలను తినాలని కోరుకుంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us