AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేమియా కేసరి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేసుకోండి

ఇంట్లోనే సులువుగా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో ఈ విధానంలో తెలుసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేయించడం నుంచి సరైన కొలతలతో షుగర్ చేర్చడం వరకు, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. పూర్తి డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ...

సేమియా కేసరి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేసుకోండి
Semiya Kesari Recipe
Ram Naramaneni
|

Updated on: Apr 02, 2026 | 3:53 PM

Share

గుమగుమలాడే సేమియా కేసరిని ఇంట్లోనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో సులువుగా తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు లేదా ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు సరైన ఎంపిక.

తయారీ విధానం:

ముందుగా, స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ను (జీడిపప్పు, కిస్మిస్, బాదం లేదా పిస్తా) గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్‌లు రుచికి తగ్గట్టు ఎంతైనా వాడుకోవచ్చు. ఇప్పుడు అదే పాన్‌లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగిన తర్వాత రెండు కప్పుల సేమియాను వేయాలి. సేమియాను మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే సేమియా అడుగున మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. సేమియా బాగా వేగిన తర్వాత ఈ పాన్‌ను పక్కన పెట్టుకోవాలి. తరువాత, స్టవ్ మీద ఒక పెద్ద కడాయిని పెట్టి అందులో నాలుగు కప్పుల నీటిని పోయాలి. రెండు కప్పుల సేమియాకు రెట్టింపు అంటే నాలుగు కప్పుల నీటిని తీసుకోవాలి. నీటిని హై ఫ్లేమ్‌లో బాగా మరిగించుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను అందులో వేసి, హై ఫ్లేమ్‌లోనే పది నిమిషాల పాటు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించాలి. పది నిమిషాల తర్వాత ఫ్లేమ్‌ను మీడియంకి తగ్గించాలి. సేమియా చాలా వరకు ఉడికిన తర్వాత, ఒకటిన్నర కప్పు పంచదారను అందులో కలపాలి. ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదార సరైన కొలత. ఎక్కువైతే తీపి ఎక్కువగా ఉంటుంది. పంచదార వేసిన తర్వాత బాగా కలిపి, పంచదార కరిగి సిరప్‌లా మారి సేమియా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి. ఈ దశలో కొంచెం ఓపిక అవసరం, లేదంటే అడుగు అంటుకోవచ్చు. సేమియా కేసరి కొద్దిగా దగ్గర పడిన తర్వాత, రంగు కోసం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ (చిటికెడు సరిపోతుంది) వేసి బాగా కలపాలి. ఇది మీ ఇష్టం, కానీ పిల్లలు రంగురంగుల ఆహారాన్ని ఇష్టపడతారు. ఆ తర్వాత, మంచి సువాసన కోసం ఒక చిటికెడు యాలకుల పొడిని చేర్చాలి. యాలకుల పొడి కేసరి రుచిని, సువాసనను చాలా పెంచుతుంది. మరొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా కలిపి, కేసరి కడాయికి అంటుకోకుండా పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించాలి. కేసరి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు మరియు కొద్దిగా నెయ్యిని వేసి బాగా కలిపితే, రుచికరమైన సేమియా కేసరి సిద్ధం.

Also Read: నా వయస్సు 85 ఏళ్లు.. డైలీ ఓల్డ్ మంక్ తాగుతా.. సీనియర్ నటుడి క్రేజీ కామెంట్స్.. 

Follow Us