AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockroach Control: బొద్దింకలపై బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో ఒక్కటి కూడా లేకుండా తరిమేయండి..

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు, చీమలతో పాటు బొద్దింకల సమస్య ఎక్కువ అవుతుంది. రాత్రి వేళల్లో కిచెన్, బెడ్‌రూమ్, బాత్రూమ్‌లలో ఇవి స్వేచ్ఛగా తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరు వీటిని చూసి భయపడతారు కూడా. ఇవి ఆహార పదార్థాలు, వంట సామాగ్రిపై తిరుగుతూ ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలను వ్యాపింపజేసి అనారోగ్యాలకు దారి తీస్తాయి. సాధారణంగా బొద్దింకల నివారణకు రసాయన స్ప్రేలు వాడతారు, కానీ అవి మన ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని సహజ పద్ధతులు, సరళమైన చిట్కాలతో వీటిని సులభంగా ఇంటి నుండి తరిమికొట్టవచ్చని వారు సూచిస్తున్నారు.

Cockroach Control: బొద్దింకలపై బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో ఒక్కటి కూడా లేకుండా తరిమేయండి..
Cockroach Control In Home
Bhavani
|

Updated on: Jul 04, 2025 | 8:11 AM

Share

బొద్దింకలు ఇతర కీటకాల సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బొద్దింకలు తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే కప్‌బోర్డులు, కిచెన్‌లోని సింకు చుట్టూ, బాత్రూమ్‌లలో తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోండి. రోజూ వీటిని శుభ్రం చేయండి. తిన్న వెంటనే ప్లేట్లను శుభ్రం చేయండి. ఆహారం మిగిలిపోతే, వెంటనే మూత ఉన్న డబ్బాల్లో పెట్టండి లేదా బయట పారవేయండి. ఆహార వ్యర్థాలు ఎక్కడా పేరుకుపోకుండా చూసుకోండి.

బొద్దింకలకు అట్టపెట్టెలు ఆహారంగా మారతాయి. అందువల్ల, అవసరం లేని అట్టపెట్టెలను ఇంట్లో ఉంచకుండా తొలగించండి. బొద్దింకలు లోపలికి రాకుండా ఉండేందుకు రాత్రి వేళల్లో లేదా అవసరం లేనప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. చెత్త డబ్బాలకు ఎప్పుడూ గట్టిగా మూత పెట్టండి. రాత్రి పడుకునే ముందు చెత్త డబ్బాను ఇంటి బయట ఉంచడానికి ప్రయత్నించండి. డిష్‌వాషర్‌లు బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశించే మార్గాలలో ఒకటి. అందుకే రాత్రి వేళల్లో డిష్‌వాషర్‌లను మూసి ఉంచండి.

దాల్చినచెక్క:

దాల్చినచెక్క ఘాటైన వాసన బొద్దింకలకు పడదు. దాల్చినచెక్క పొడిని కొద్దిగా ఉప్పులో కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లితే, అవి రాకుండా ఉంటాయి. ఇది బొద్దింకలతో పాటు వాటి గుడ్లను కూడా నాశనం చేయడంలో సహాయపడుతుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయల నుండి వచ్చే ఘాటైన వాసన బొద్దింకలను దూరంగా ఉంచుతుంది. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉల్లిపాయ రసాన్ని స్ప్రే చేయడం వల్ల అవి అక్కడి నుండి పారిపోతాయి.

లవంగాలు:

లవంగాలు కూడా బొద్దింకల నివారణకు చాలా బాగా పనిచేస్తాయి. బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో కొన్ని లవంగాలను ఉంచితే సరిపోతుంది. 2009లో “జర్నల్ ఆఫ్ ఎంటమాలజీ అండ్ జూవాలజీ” లో ప్రచురితమైన ఒక అధ్యయనం లవంగాల నూనె బొద్దింకలను దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొంది.

బేకింగ్ సోడా, చక్కెర:

బేకింగ్ సోడా, చక్కెరను సమాన నిష్పత్తిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి. బొద్దింకలు ఈ మిశ్రమాన్ని తిన్న వెంటనే చనిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వాటిని తొలగిస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది.