డాక్టర్ సలహా లేకుండా ఎక్కువుగా మందులు వాడుతున్నారా..! ఒక్కసారి మీ లివర్ పనితీరు చెక్ చేసుకోవాల్సిందే..!
Antibiotics and Liver Injury: మన దేశంలో ఎక్కువ మంది చిన్నా పెద్ద రోగాలకు డాక్టర్ సలహాతో పనిలేకుండా మందుల షాపులో అడిగి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. అయితే ఇటువంటి మందుల ప్రభావం కాలేయంపై..
Antibiotics and Liver Injury: మన దేశంలో ఎక్కువ మంది చిన్నా పెద్ద రోగాలకు డాక్టర్ సలహాతో పనిలేకుండా మందుల షాపులో అడిగి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. అయితే ఇటువంటి మందుల ప్రభావం కాలేయంపై అత్యధికంగా చూపిస్తుందని.. దీంతో కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
యాంటీ డిప్రెస్సెంట్స్, మూడ్ స్టెబిలైజర్స్, కార్టికోస్టెరాయిడ్స్, పెయిన్ రిలీవర్స్ వంటి పలు రకాల మెడిసిన్‌లను దీర్ఘ కాలం వాడినా లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. క్యాన్సర్ చికిత్స కోసం చేసే కీమోథెరపీ కూడా లివర్ కు దెబ్బే.. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వ్యాధులు వచ్చినప్పుడు సరైన సమయంలో స్పందించి చికిత్స చేయించుకోకపోయినా లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది.పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడి అవి తీవ్రతరమైనా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా మందులు వాడే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని.. దాదాపు వెయ్యిరకాల మందులు, సప్లిమెంట్లు వంటి వ్యర్థాలతో కాలేయం నిండిపోయి హైపటోటాక్సిసిటీకి కారణమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో స్పష్టమయ్యింది.
అయితే ఈ కాలేయ సమస్య వయసు పైబడిన వారిలో రెండురెట్లు అధికంగా ఉంటుందని . అందుకే వృద్ధులు వేసుకునే మందుల దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. వృద్ధాప్య దశలో మందుల్ని జీర్ణించుకునే శక్తి బాగా తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో వారు మోతాదును మించి మందులు వేసుకుంటే కాలేయ వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పురుషుల కన్నా స్త్రీలే ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజ్యురీ బారిన పడే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో బయటపడింది.
ఇక మనం తీసుకునే ఆహార పానీయాలన్నీ జీర్ణాశయం గుండా కాలేయానికి చేరాల్సిందే. అవన్నీ రక్తప్రసరణతో కలిసి కాలేయం నుంచి పయనించాల్సిందే. మనం తీసుకునే పోషకాల్లోని హానికారక పదార్థాలన్నింటినీ వడబోసే కీలక బాధ్యతను కాలేయం నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ అంత సులభమైనదేమీ కాదు. ఈ భారం మరీ అధికమైనప్పుడు ఒక్కోసారి కాలేయం దెబ్బతినే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇలా దెబ్బతినే పరిణామాల వెనుక డాక్టర్ సలహా లేకుండా మందులు కొనుక్కుని వేసుకునే అలవాటొకటి ప్రధాన కారణంఅని ఆరోగ్య నిపులు చెబుతున్నారు.కనుక ప్రతి చిన్న రోగానికి నచ్చిన మందులు వేసుకునే వారు ఇక నుంచైనా వైద్యుల సలహాతో వేసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Centauri Honey: ఖరీదుతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న తేనె .. కిలో 8లక్షల పైమాటే.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..? Karthika Deepam Serial: పిల్లల కోసం బయలుదేరిన కార్తీక్.. అయినా మోనిత వైపే ఆలోచనలు.. మరోవైపు ఆసుపత్రిలో దీప..